ఆర్‌బీఐ తీరు చట్ట విరుద్ధం
ఆర్‌బీఐ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి ఫిర్యాదు చేశారు. ఏపీ బేవరేజెస్ సంస్థ ఆదాయపు పన్ను కట్టలేదన్న కారణంగా రిజర్వు బ్యాంకు ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా టీ.సర్కారు ఖాతా నుంచి రూ.1,274 కోట్లను ఐటీ శాఖకు మరలించిందని కేటీఆర్ కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశారు. చట్టవిరుద్దంగా తీసుకున్న ఈ నిధులను తిరిగి ఇచ్చేలా ఆర్‌బీఐను ఆదేశించాలని ఆయన కేంద్రమంత్రిని కోరారు. సీఎస్ రాజీవ్‌శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి ప్రదీప్ చంద్ర, […]
ఆర్‌బీఐ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి ఫిర్యాదు చేశారు. ఏపీ బేవరేజెస్ సంస్థ ఆదాయపు పన్ను కట్టలేదన్న కారణంగా రిజర్వు బ్యాంకు ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా టీ.సర్కారు ఖాతా నుంచి రూ.1,274 కోట్లను ఐటీ శాఖకు మరలించిందని కేటీఆర్ కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశారు. చట్టవిరుద్దంగా తీసుకున్న ఈ నిధులను తిరిగి ఇచ్చేలా ఆర్‌బీఐను ఆదేశించాలని ఆయన కేంద్రమంత్రిని కోరారు. సీఎస్ రాజీవ్‌శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి ప్రదీప్ చంద్ర, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి నర్సింగరావులతో కూడిన మంత్రి బృందం శనివారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రితో భేటీ అయింది. ఏపీ బేవరేజెస్ సంస్థ ఆస్తులు, అప్పుల విభజన ఇంకా జరగలేదని ఆయన కేంద్రమంత్రికి విన్నవించారు. 2012-13కు ఏపీ బేవరేజెస్ ఆదాయపు పన్ను కట్టలేదంటూ తెలంగాణ ప్రభుత్వ ఖాతా నుంచి తరలించడం సరికాదని కేటీఆర్ అరుణ్‌జైట్లీకి తెలిపారు. చట్టానికి, కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా, ముందస్తు నోటీస్ లేకుండా నిధులు తీసుకోవడం చాలా అన్యాయమని, కేంద్రం జోక్యం చేసుకుని తమ నిధులు తమకు ఇప్పించాలని మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రిని కోరారు.