కేసీఆర్‌వి బూట‌క‌పు వాగ్దానాలు: జానా

అమలుకాని వాగ్దానాలతో కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి ఆరోపించారు. వ‌రంగ‌ల్ జిల్లా భూపాల్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న జానారెడ్డి మాట్లాడుతూ.. 150 ఏళ్ల చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా పేదలకు మూడెకరాల భూమి ఇస్తామని వాగ్దానం చేయలేదన్నారు. కేసీఆర్‌ అమలుకాని వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ హయాంలో నిరుపేదలకు ఇచ్చిన 40 లక్షల ఇళ్లు ఇంకా పూర్తికాలేదని, అవి పూర్తికాకముందే ఇంకా ఇళ్లు నిర్మిస్తామని […]

Advertisement
Update:2015-06-25 18:51 IST

అమలుకాని వాగ్దానాలతో కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి ఆరోపించారు. వ‌రంగ‌ల్ జిల్లా భూపాల్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న జానారెడ్డి మాట్లాడుతూ.. 150 ఏళ్ల చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా పేదలకు మూడెకరాల భూమి ఇస్తామని వాగ్దానం చేయలేదన్నారు. కేసీఆర్‌ అమలుకాని వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ హయాంలో నిరుపేదలకు ఇచ్చిన 40 లక్షల ఇళ్లు ఇంకా పూర్తికాలేదని, అవి పూర్తికాకముందే ఇంకా ఇళ్లు నిర్మిస్తామని కేసీఆర్ అంటున్నారని జానారెడ్డి ధ్వజమెత్తారు. ఇలాంటి క‌బుర్లు చెప్ప‌డం కేసీఆర్‌కు ఆది నుంచీ అల‌వాటేన‌ని ఆయ‌న అన్నారు.

Tags:    
Advertisement

Similar News