తెలంగాణలో జూలై 20 తర్వాత మెడికల్ కౌన్సెలింగ్
వచ్చే నెల 20 తర్వాతనే రాష్ట్రంలో మెడికల్ కౌన్సెలింగ్ షెడ్యూలును ఖరారు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు.జూలై 15 వరకూ భారతీయ వైద్య మండలి ( ఎంసీఐ) కొత్త కాలేజీలు, సీట్ల పెంపునకు అనుమతి ఇచ్చేందుకు సమయం ఉన్నందున కౌన్సెలింగ్ షెడ్యూలును 20వ తేదీ తర్వాత విడుదల చేస్తామని మంత్రి తెలిపారు.తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ సహకారంతో మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. హైదరాబాదులో 2, వరంగల్, విజయవాడల్లో […]
వచ్చే నెల 20 తర్వాతనే రాష్ట్రంలో మెడికల్ కౌన్సెలింగ్ షెడ్యూలును ఖరారు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు.జూలై 15 వరకూ భారతీయ వైద్య మండలి ( ఎంసీఐ) కొత్త కాలేజీలు, సీట్ల పెంపునకు అనుమతి ఇచ్చేందుకు సమయం ఉన్నందున కౌన్సెలింగ్ షెడ్యూలును 20వ తేదీ తర్వాత విడుదల చేస్తామని మంత్రి తెలిపారు.తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ సహకారంతో మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. హైదరాబాదులో 2, వరంగల్, విజయవాడల్లో ఒక్కో కేంద్రం చొప్పున మొత్తం 4 కేంద్రాల్లో కౌన్సెలింగ్ జరుగుతుందని మంత్రి చెప్పారు. ప్రవేట్ వైద్య కళాశాలలు ప్రత్యేకంగా నిర్వహించిన ఎంసెట్ కౌన్సెలింగ్ ను పారదర్శకంగా జరిపేందుకు ప్రభుత్వం తన ప్రతినిధిగా ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ శంకర్‌ను నియమించినున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు.