లలిత్‌మోడీకి సాయం తప్పు: బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్
ఐపీఎల్ మాజీ అధ్యక్షుడు లలిత్ మోదీకి సాయం చూసిన వారిపై హోంశాఖ మాజీ కార్యదర్శి, బీజేపీ పార్లమెంట్‌సభ్యుడు ఆర్‌కె సింగ్ మండిపడ్డారు. పరారీలో ఉన్న నిందితుడికి సాయం ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ లలిత్‌మోడీపై మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నాయని, అతనిపై సమన్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆర్కే సింగ్ అన్నారు. లలిత్ మోదీని భారత్ రప్పించేందుకు అన్నీ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అతని పాస్‌పోర్టును మరోసారి రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, […]
Advertisement
ఐపీఎల్ మాజీ అధ్యక్షుడు లలిత్ మోదీకి సాయం చూసిన వారిపై హోంశాఖ మాజీ కార్యదర్శి, బీజేపీ పార్లమెంట్‌సభ్యుడు ఆర్‌కె సింగ్ మండిపడ్డారు. పరారీలో ఉన్న నిందితుడికి సాయం ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ లలిత్‌మోడీపై మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నాయని, అతనిపై సమన్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆర్కే సింగ్ అన్నారు. లలిత్ మోదీని భారత్ రప్పించేందుకు అన్నీ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అతని పాస్‌పోర్టును మరోసారి రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఆయన ఆస్తులు జప్తు చేయాలని సింగ్ డిమాండ్ చేశారు. అప్పుడే అతన్ని చట్టం ముందు నిలబట్టే వీలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో సుష్మాస్వరాజ్‌పై ఆర్‌కె సింగ్ పరోక్ష విమర్శలు చేసినట్లు అయింది. లలిత్‌మోడీ వ్యవహారంపై బీజేపీలో భిన్నస్వరాలు వినిపించినట్లు అయింది.
Advertisement