ఎయిర్‌ టెల్‌ త్రీజీబ్రౌజర్లలో రహస్య కోడ్‌

ఎయిర్‌టెల్ త్రీజీ డేటా ప్యాకేజీ వినియోగ‌దారులు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌.. తన వినియోగదారుల బ్రౌజర్లలో ప్రోగ్రామింగ్‌ కోడ్‌ను వారికి తెలియకుండా ప్రవేశపెడుతోంది! ఎయిర్‌టెల్‌ త్రీజీ నెట్‌వర్క్‌ వినియోగదారులు ఏ వెబ్‌పేజీ ఓపెన్‌ చేసినా ఆ స‌మాచారం మీ నెట్‌వ‌ర్క్ ప్రొవైడ‌ర్‌కు తెలిసిపోతుంద‌న్న మాట! బెంగళూరుకు చెందిన తేజేష్‌ జీఎన్‌ అనే సహ కార్యకర్త, ప్రోగ్రామర్‌ దీన్ని బయటపెట్టారు. వినియోగదారుల బ్రౌజింగ్‌ సెషన్లలో ఎయిర్‌టెల్‌ జావా స్ర్కిప్ట్‌ కోడ్‌ను, ఐఫ్రేమ్స్‌ను ఎలా ప్రవేశపెడుతోందో […]

Advertisement
Update:2015-06-20 19:08 IST
ఎయిర్‌టెల్ త్రీజీ డేటా ప్యాకేజీ వినియోగ‌దారులు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌.. తన వినియోగదారుల బ్రౌజర్లలో ప్రోగ్రామింగ్‌ కోడ్‌ను వారికి తెలియకుండా ప్రవేశపెడుతోంది! ఎయిర్‌టెల్‌ త్రీజీ నెట్‌వర్క్‌ వినియోగదారులు ఏ వెబ్‌పేజీ ఓపెన్‌ చేసినా ఆ స‌మాచారం మీ నెట్‌వ‌ర్క్ ప్రొవైడ‌ర్‌కు తెలిసిపోతుంద‌న్న మాట! బెంగళూరుకు చెందిన తేజేష్‌ జీఎన్‌ అనే సహ కార్యకర్త, ప్రోగ్రామర్‌ దీన్ని బయటపెట్టారు. వినియోగదారుల బ్రౌజింగ్‌ సెషన్లలో ఎయిర్‌టెల్‌ జావా స్ర్కిప్ట్‌ కోడ్‌ను, ఐఫ్రేమ్స్‌ను ఎలా ప్రవేశపెడుతోందో కోడ్‌తో సహా రట్టు చేశారు. వినియోగదారుల బ్రౌజర్లలోకి ప్రవేశిస్తున్న ఈ కోడ్‌ను ట్రేస్‌ చేయగా.. అది భారతి ఎయిర్‌టెల్‌ నుంచి వస్తున్నట్టు తేలింది. ఈ విషయం బయటపడటంతో తాను చేస్తున్న పనిని ఒప్పుకొంటూ ఎయిర్‌టెల్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. వినియోగదారుల డేటా వినియోగాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరాల్లో ఒక భాగమే ఈ కోడ్‌ అని పేర్కొంది. ఎంపిక చేసిన వారి ఫోన్లలో మాత్రమే దీన్ని పరీక్షిస్తున్నామని.. ఇందుకోసం ఎరిక్‌సన్‌తో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది. ఎరిక్‌సన్‌ ‘ఫ్లాష్‌ నెట్‌వర్క్స్‌’కు చెందిన మొబైల్‌ సొల్యూషన్స్‌ను వినియోగిస్తోంది. ప్రస్తుతానికి ఈ టెస్టింగ్‌ ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేసింది. అంటే ఈ విష‌య‌న్ని క‌నిపెట్ట‌కుండా ఉంటే త‌మ‌ ర‌హ‌స్యాలు తెలుసుకునేదేగా అంటున్నారు వినియోగ‌దారులు. అందుకే ఇపుడు వేరే నెట్‌వ‌ర్క్‌ల‌కు మారిపోవ‌డానికి సంసిద్ధుల‌వుతున్నారు.
Tags:    
Advertisement

Similar News