బీసీ ఎంపీలను రాళ్లతో కొట్టిస్తా: కృష్ణయ్య

పార్లమెంట్‌లో త‌మ వ‌ర్గం సమస్యలను ప్రస్తావించని బీసీ ఎంపీలను రాళ్లతో కొట్టిస్తామని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు బీసీలంతా తీవ్రవాదులుగానో, ఉగ్రవాదులుగానో మారి ప్ర‌జా నాయ‌కుల భ‌రతం ప‌డ‌తార‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రా ప్రభుత్వాలు బీసీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, సమస్యలపై ఇద్దరు సీఎంలను నిలదీస్తామని చెప్పారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ […]

Advertisement
Update:2015-06-12 19:10 IST

పార్లమెంట్‌లో త‌మ వ‌ర్గం సమస్యలను ప్రస్తావించని బీసీ ఎంపీలను రాళ్లతో కొట్టిస్తామని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు బీసీలంతా తీవ్రవాదులుగానో, ఉగ్రవాదులుగానో మారి ప్ర‌జా నాయ‌కుల భ‌రతం ప‌డ‌తార‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రా ప్రభుత్వాలు బీసీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, సమస్యలపై ఇద్దరు సీఎంలను నిలదీస్తామని చెప్పారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కేసీఆర్ ఇంత‌వ‌ర‌కు ఏ ఒక్కరికీ కూడా ఉద్యోగం ఇవ్వలేదని విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News