తేలనున్న బాబు భవితవ్యం!
ఏపీ సీఎం చంద్రబాబు భవితవ్యం ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్(ఎఫ్‌ఎస్‌ఎల్)కు పంపిన ఆడియో టేపుల్లో ఉంది. టేపుల్లో ఉన్న గొంతు బాబుదే అని తేలిదే ఆయన రాజకీయ జీవితం పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుపోతుందడనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఆయన 37 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఇంతటి విషమపరీక్షను ఎదుర్కోలేదు. వాస్తవానికి ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్న బాబుకు అప్పట్లోనే పెద్ద ముప్పు తప్పింది. ఎన్‌టీ ఆర్ మరో పార్టీ పెట్టారు. ఇందుకు సంబంధించి […]
Advertisement
ఏపీ సీఎం చంద్రబాబు భవితవ్యం ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్(ఎఫ్‌ఎస్‌ఎల్)కు పంపిన ఆడియో టేపుల్లో ఉంది. టేపుల్లో ఉన్న గొంతు బాబుదే అని తేలిదే ఆయన రాజకీయ జీవితం పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుపోతుందడనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఆయన 37 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఇంతటి విషమపరీక్షను ఎదుర్కోలేదు. వాస్తవానికి ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్న బాబుకు అప్పట్లోనే పెద్ద ముప్పు తప్పింది. ఎన్‌టీ ఆర్ మరో పార్టీ పెట్టారు. ఇందుకు సంబంధించి బహిరంగ సభకు ఏర్పాట్లు కూడా జరిగాయి. కానీ, అకస్మాత్తుగా ఆయన గుండెపోటుతో మరణించారు. లేకుంటే మామ- అల్లుళ్ల మధ్య రాజకీయపోరులో ఎన్‌టీఆర్‌దే పైచేయి అయ్యేది. బలమైన మీడియా అండదండలతో అప్పుడు తెరవెనక జరిగిన చాలా పరిణామాలను తొక్కిపెట్టారన్నది వాస్తవం. వీటన్నింటితో విసిగిపోయిన ఎన్‌టీఆర్ ఆ మనస్తాపంతోనే మరణించారు.
బాబు అప్పట్లోనే ఎమ్మెల్యేలను కొన్నారా?
చంద్రబాబుపై ఇలాంటి ఆరోపణలు కొత్తవేం కాదు. 1995, ఆగస్టులో మామను పదవి నుంచి తప్పించేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇవే ఆరోపణలు విలేకరుల సమావేశంలో ఎన్‌టీఆర్ కూడా చేశారు. ఇప్పడు కొన్ని చానళ్లు ఆ వీడియోను తిరిగి ప్రసారం చేస్తున్నాయి కూడా. అయితే ఆ విషయాలు బయటకిరాకుండా.. చంద్రబాబు అనుకూల మీడియా ఆ వాస్తవాలను తొక్కిపెట్టిందని ప్రత్యర్థులు చంద్రబాబును నేటికీ నిందిస్తూనే ఉన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో వెన్నుపోటుదారుడు అన్న విమర్శ వారంలో కనీసం ఒక్కసారైనా ఎదుర్కొంటున్నారంటే అదంతా ఎన్టీఆర్‌ను పదవి నుంచి తప్పించిన పుణ్యమే! ఇందులో అనుమానమే లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్, మాజీముఖ్యమంత్రి రోశయ్యలు చంద్రబాబును విమర్శించాలంటే ముందు పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన గొప్పవాడు చంద్రబాబు అంటూ మొదలు పెట్టేవారు. అప్పటినుంచి ఇప్పటిదాకా చంద్రబాబు ఈ వ్యాఖ్యలపై నోరు విప్పింది లేదు. ఖండించింది లేదు.
ఇప్పటికీ అదే తీరు!
మామకు వెన్నుపోటు పొడిచాడంటూ 21 ఏళ్లుగా , ఓటుకునోటు ఎర కేసులో సూత్రధారి అంటూ 15రోజులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు ఆ రెండు విషయాలపై ఇప్పటికీ నోరు మెదప లేదు. తెలంగాణ ప్రభుత్వం తమను వేధిస్తోందని కేంద్రానికి ఫిర్యాదులు చేశాడు. జాతీయమీడియాకు ఇంటర్వ్యులు ఇచ్చాడు. ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్లు ఆ టేపుల్లో గొంతు మీదా? కాదా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. బట్టీ పట్టినట్లు పదేపదే తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించాడే కానీ, రేవంత్‌రెడ్డి విషయాన్ని, ఆడియో టేపుల విషయాన్నీ ఖండించలేదు. నిజంగా గొంతు బాబుదేనని తేలితే.. ఎంత బలమైన మీడియా అండదండలు ఉన్నా ఏం చేయలేరన్నది వాస్తవం.
Advertisement