పారిశ్రామికవేత్తలకు టీ-సర్కార్ రెడ్ కార్పెట్!
తెలంగాణలో పరిశ్రమలు పెట్టేవారికి ఎర్ర తివాచీ పరుస్తామని, పారిశ్రామికవేత్తలను ఎట్టి పరిస్థితుల్లోను నిరాశ పర్చబోమని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలిపారు. శుక్రవారం ఆయన దేశవిదేశాలకు చెందిన అనేక మంది పారిశ్రామికవేత్తల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. పరిశ్రమలకు సింగిల్‌విడో అనుమతులు మంజూరు చేస్తామని, ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎవరైనా పరిశ్రమ కోసం దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో అన్ని అనుమతులు వచ్చి తీరతాయని చెప్పారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు డోకాలేదని, ఇది […]
Advertisement
తెలంగాణలో పరిశ్రమలు పెట్టేవారికి ఎర్ర తివాచీ పరుస్తామని, పారిశ్రామికవేత్తలను ఎట్టి పరిస్థితుల్లోను నిరాశ పర్చబోమని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలిపారు. శుక్రవారం ఆయన దేశవిదేశాలకు చెందిన అనేక మంది పారిశ్రామికవేత్తల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. పరిశ్రమలకు సింగిల్‌విడో అనుమతులు మంజూరు చేస్తామని, ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎవరైనా పరిశ్రమ కోసం దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో అన్ని అనుమతులు వచ్చి తీరతాయని చెప్పారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు డోకాలేదని, ఇది కేసీఆర్ చెబుతున్న మాట అని భరోసా ఇచ్చారు. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం ప్రకటించిన ఆయన దేశంలో మూడో వంతు ఫార్మా రంగం తెలంగాణలోనే ఉందని, అందుకే హైదరాబాద్‌లో ఫార్మా యూనివర్శిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వసతులతో ఇండస్ట్రియల్ కారిడార్‌లు ఏర్పాటు చేస్తామని, భూమి, విద్యుత్, నీరు వంటివన్నీ ప్రభుత్వమే సమకూరుస్తుందని ఆయన తెలిపారు. 100 శాతం అవినీతి రహిత విధానం అమలు చేస్తామని, అధికారుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా అనుమతులన్నీ సకాలంలో వచ్చే విధంగా చేస్తామని ఆయన తెలిపారు. అనుమతులు ఇచ్చే విషయంలో ఏ అధికారి అయినా, ఉద్యోగి అయినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గమనిస్తే వారికి జరిమానాలు విధిస్తామని కేసీఆర్ చెప్పారు. ఏదో హైప్ సృష్టించడం తమ ప్రభుత్వ విధానం కాదని, తమ ప్రభుత్వం అనుసరించే విధానమే హైప్ సృష్టించాలని తాను కోరుకుంటున్నానని ఆయన తెలిపారు.
Advertisement