'2017 జూలై నాటికి మెట్రో రైలు'

హైదరాబాద్ నగరంలోని జీహెచ్ఎంసీ, ఎల్ అండ్ టీ సంస్థ మధ్య ఎలాంటి వివాదం లేదని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ వ్య‌యం ప్రస్తుతానికి రూ. 20 వేల కోట్లకు చేరుకుందని రెడ్డి తెలిపారు. మెట్రో రైలు నిర్మాణ మార్గం కొంచెం తెలంగాణ ప్ర‌భుత్వం మార్చింద‌ని, ఆ మార్గానికి తుది రూపం ఇస్తే ప‌నులు చ‌క‌చ‌కా నిర్వ‌హించ‌డానికి అవ‌కాశం ఏర్ప‌డుతుంద‌ని ఆయ‌న తెలిపారు. కాగా హైదరాబాద్ మెట్రో రైలు పనులు […]

Advertisement
Update:2015-06-09 18:53 IST
హైదరాబాద్ నగరంలోని జీహెచ్ఎంసీ, ఎల్ అండ్ టీ సంస్థ మధ్య ఎలాంటి వివాదం లేదని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ వ్య‌యం ప్రస్తుతానికి రూ. 20 వేల కోట్లకు చేరుకుందని రెడ్డి తెలిపారు. మెట్రో రైలు నిర్మాణ మార్గం కొంచెం తెలంగాణ ప్ర‌భుత్వం మార్చింద‌ని, ఆ మార్గానికి తుది రూపం ఇస్తే ప‌నులు చ‌క‌చ‌కా నిర్వ‌హించ‌డానికి అవ‌కాశం ఏర్ప‌డుతుంద‌ని ఆయ‌న తెలిపారు. కాగా హైదరాబాద్ మెట్రో రైలు పనులు చకచక సాగుతున్నాయని, మరో రెండేళ్లలో మెట్రో రైలు నగర ప్రజలకు అందుబాటులోకి రానుందని మెట్రో రైలు నిర్మాణం చేస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ ఎండీ వి.బి.గాడ్గిల్ వెల్లడించారు. 2017 జూలై నెల నాటికి హైదరాబాద్ మెట్రో రైలు నిర్మాణం పూర్తవుతుందని ఆయన వెల్లడించారు. అలాగే నగరంలో 18.5 మిలియన్ చదరపు అడుగుల కమర్షియాల్ మాల్స్ అభివృద్ధి చేస్తున్నామ‌ని గాడ్గిల్ వివరించారు.
Tags:    
Advertisement

Similar News