పన్ను ఎగవేతదారులపై కొరడా: సిబిడిటి నిర్ణయం
పన్ను ఎగవేతదారుల పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) ఐటి అధికారులకు ఆదేశాలిచ్చింది. తనిఖీలు చేపట్టి అంతంత మాత్రం జరిమానాలతోనే సరిపుచ్చకుండా… జైలుకు పంపుతామన్న భయాలు కల్పించడంతోపాటు సమాజంలో అవమానకర పరిస్థితులు ఎదుర్కొనే విధంగా చేస్తామన్నట్టుగా వ్యవహరించాలని సూచించింది. పన్ను ఎగవేతదారులకు సంబంధించిన కేసులను వేగవంతంగా విచారించడంతోపాటు భారీ స్థాయిలో జరిమానాలను విధించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. తనిఖీలు చేపట్టే విషయంలోనే కాకుండా ప్రభుత్వ రాబడిని పెంచేందుకు అనుసరించే మార్గాల విషయంలో […]
Advertisement
పన్ను ఎగవేతదారుల పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) ఐటి అధికారులకు ఆదేశాలిచ్చింది. తనిఖీలు చేపట్టి అంతంత మాత్రం జరిమానాలతోనే సరిపుచ్చకుండా… జైలుకు పంపుతామన్న భయాలు కల్పించడంతోపాటు సమాజంలో అవమానకర పరిస్థితులు ఎదుర్కొనే విధంగా చేస్తామన్నట్టుగా వ్యవహరించాలని సూచించింది. పన్ను ఎగవేతదారులకు సంబంధించిన కేసులను వేగవంతంగా విచారించడంతోపాటు భారీ స్థాయిలో జరిమానాలను విధించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. తనిఖీలు చేపట్టే విషయంలోనే కాకుండా ప్రభుత్వ రాబడిని పెంచేందుకు అనుసరించే మార్గాల విషయంలో అధికారులు తమ మైండ్‌సెట్‌ను మార్చుకోవాలని సూచించింది. పన్ను ఎగవేతదారులకు భారీగా జరిమానాలు విధించడంతోపాటు విచారణను ఎదుర్కొనే విధంగా చేయడం వల్ల పన్ను ఎగవేతదారులు హద్దులు దాటేందుకు జంకుతారని పేర్కొంది.
Advertisement