ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనమే గెలుస్తాం: చంద్రబాబు
టీఆర్‌ఎస్ నేతలు ఎన్ని కుట్రలు పన్నినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పకుండా మనమే గెలుస్తాం. మన పార్టీ ఎమ్మెల్యేలపై వారు అన్ని రకాలుగా ఒత్తిడి తెస్తున్నారు. వారి చర్యలను మనవాళ్లు కూడా దీటుగా ఎదుర్కొంటున్నారు. మున్ముందు కూడా ఇదే విధంగా ఎమ్మెల్యేలంతా సంఘటితమై అధికారపక్షాన్ని ఎదుర్కోవాలి.’’ అంటూ తెలంగాణ టీడీపీ నేతలకు ఏపీసీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ టీడీపీ నేతలు అధినేత చంద్రబాబును ఎమ్మెల్సీ ఎన్నికలు, మహానాడు ఏర్పాట్ల గురించి కొద్ది సేపు చర్చించారు. ఎమ్మెల్యే కోటా […]
టీఆర్‌ఎస్ నేతలు ఎన్ని కుట్రలు పన్నినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పకుండా మనమే గెలుస్తాం. మన పార్టీ ఎమ్మెల్యేలపై వారు అన్ని రకాలుగా ఒత్తిడి తెస్తున్నారు. వారి చర్యలను మనవాళ్లు కూడా దీటుగా ఎదుర్కొంటున్నారు. మున్ముందు కూడా ఇదే విధంగా ఎమ్మెల్యేలంతా సంఘటితమై అధికారపక్షాన్ని ఎదుర్కోవాలి.’’ అంటూ తెలంగాణ టీడీపీ నేతలకు ఏపీసీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ టీడీపీ నేతలు అధినేత చంద్రబాబును ఎమ్మెల్సీ ఎన్నికలు, మహానాడు ఏర్పాట్ల గురించి కొద్ది సేపు చర్చించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఎక్కువగా ఏకగ్రీవమవుతాయని, ఎన్నికలు చాలా అరుదుగా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు వేసే విధానం ప్రత్యేకంగా ఉంటుందని, ఓటింగ్‌పై పార్టీ ఎమ్మెల్యేలకు అవగాహన ఉన్నప్పటికీ, ఇలాంటి సమయంలో పొరపాటు చేయకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ విధానం, ఓటు వేసే తీరుపై ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని తెలంగాణ నేతలను ఆదేశించారు. హైటెక్ హంగులతో మహానాడు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని… వినూత్నంగా స్టేజీ ఏర్పాట్లు చేస్తున్నామని జూబ్ల్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, చంద్రబాబుకు వివరించారు.