జ‌గ‌న్‌తో పొత్తా... ఉత్తుదే: వెంక‌య్య‌

తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో, ఏపీలో జగన్‌తో పొత్తు పెట్టుకునే ఊహాగానాలను కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కొట్టిపారేశారు. టీడీపీని పక్కన పెట్టే పరిస్థితి లేదని, అటువంటి ప్రతిపాదన కూడా ఏమీ లేదని వెంకయ్య తేల్చి చెప్పారు. జగన్‌ను, చంద్రబాబును ఒకచోట ఉంచుకోలేని పరిస్థితని వివరించారు. జగన్‌తో పొత్తు రాజకీయ అవగాహన లేనివాళ్ల ఆలోచనలని కొట్టిపారేశారు. దక్షిణాదిలో బలపడాలని బీజేపీ ఇప్పటికే వ్యూహాత్మక నిర్ణయం తీసుకుందని, 2014 నుంచే ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. […]

Advertisement
Update:2015-05-25 06:11 IST
తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో, ఏపీలో జగన్‌తో పొత్తు పెట్టుకునే ఊహాగానాలను కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కొట్టిపారేశారు. టీడీపీని పక్కన పెట్టే పరిస్థితి లేదని, అటువంటి ప్రతిపాదన కూడా ఏమీ లేదని వెంకయ్య తేల్చి చెప్పారు. జగన్‌ను, చంద్రబాబును ఒకచోట ఉంచుకోలేని పరిస్థితని వివరించారు. జగన్‌తో పొత్తు రాజకీయ అవగాహన లేనివాళ్ల ఆలోచనలని కొట్టిపారేశారు. దక్షిణాదిలో బలపడాలని బీజేపీ ఇప్పటికే వ్యూహాత్మక నిర్ణయం తీసుకుందని, 2014 నుంచే ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. తనను ఆంధ్రప్రదేశ్‌ వ్యక్తిగా గుర్తించడంలో వస్తున్న విమర్శలపై వెంకయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘రాష్ట్రం నుంచి పోటీ చేస్తే ఇక్కడి ప్రజలు ఓడించారు. అందుకే కర్ణాటకకు వెళ్లి రాజ్యసభ సభ్యుడిని అయ్యాను. 15 ఏళ్లుగా కర్ణాటక నుంచే ఉన్నాను. కేంద్రమంత్రిగా నాకు అన్ని రాష్ట్రాలూ సమానమే’’ అని చెప్పారు.
ప్ర‌త్యేక హోదా అర్హ‌త‌లు ఏపీకి లేవు
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికిగానీ, తనకుగానీ ఎలాంటి అభ్యంతరాలూ లేవన్నారు వెంకయ్యనాయుడు. అయితే ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఒక్క ఆర్థిక లోటు తప్ప ఇతర కారణాలేమీ కనిపించడం లేదన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి కావాల్సిన అర్హతలేవీ ఏపీకి లేవన్నారు. ఇప్పటికే దేశంలోని కేరళ, తమిళనాడు వంటి ఏడు రాష్ట్రాలు తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నాయని గుర్తు చేశారు. వీటన్నింటికీ ప్రత్యేక హోదా ఇవ్వాలంటే సహేతుక కారణాలుండాలని వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం గతంలోనే తాను పార్లమెంటులో పోరాడానని గుర్తు చేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీని గురించి ఆలోచిస్తోందని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి హోదాపై చర్చిస్తున్నారని, త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
Tags:    
Advertisement

Similar News