గవర్నర్‌ కోటా టీడీపీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఖ‌రారు

గవర్నర్‌ కోటా నాలుగో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పంచుమ‌ర్తి అనురాధ స్థానంలో బీదా రవిచంద్రను టీడీపీ ఎంపిక చేసింది. మొత్తం గవర్నర్‌ కోటాలో నలుగురిలో రెండు ఓసీ సమాజిక వర్గం, రెండు బీసీ సామాజిక వర్గం నుంచి అభ్యర్థులు ఎంపికయ్యారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, టీడీ జనార్దన్‌ ఓసీ సామాజిక వర్గం నుంచి ఎంపికవగా, చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు జి.శ్రీనివాసులు, బీదా రవించంద్ర బీసీ సామాజికవర్గం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికయ్యారు. గతంలో మూడు ఎమ్మెల్సీలను ఎంపిక చేసినప్పుడు […]

Advertisement
Update:2015-05-22 18:34 IST
గవర్నర్‌ కోటా నాలుగో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పంచుమ‌ర్తి అనురాధ స్థానంలో బీదా రవిచంద్రను టీడీపీ ఎంపిక చేసింది. మొత్తం గవర్నర్‌ కోటాలో నలుగురిలో రెండు ఓసీ సమాజిక వర్గం, రెండు బీసీ సామాజిక వర్గం నుంచి అభ్యర్థులు ఎంపికయ్యారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, టీడీ జనార్దన్‌ ఓసీ సామాజిక వర్గం నుంచి ఎంపికవగా, చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు జి.శ్రీనివాసులు, బీదా రవించంద్ర బీసీ సామాజికవర్గం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికయ్యారు. గతంలో మూడు ఎమ్మెల్సీలను ఎంపిక చేసినప్పుడు చివరి నిమిషంలో బీదా రవింద్ర పేరును మార్చిన విషయం తెలిసిందే. బీదా స్థానంలో తిప్పేస్వామి అవకాశం దక్కించుకున్నారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో చివరి నిమిషంలో చోటు చేసుకున్న పరిణామాల్లో బీదా రవిచంద్రను అదృష్టం వరించింది. నాలుగో ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీద రవిచంద్ర పేరును ఎంపిక చేస్తూ కొద్దిసేపటి క్రితమే గవర్నర్‌కు సీఎం చంద్రబాబు లేఖ పంపినట్లు సమాచారం.
Tags:    
Advertisement

Similar News