20 వేల కోట్లతో సైన్యం ఆధునికీకరణ
సైన్యం ఆధునికీకరణపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో రూ.20 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ‘మేకిన్ ఇండియా’ విధానంలో భాగంగా ఆర్మీ అవసరాల కోసం ఆయా పరికరాల తయారీని భారత్‌లోనే చేపడతారు. రక్షణ శాఖ దీనికి ఆమోదం తెలిపింది. ఎం-777 రకానికి చెందిన 145 హోవిట్జర్ ఆర్టిలరీ తుపాకులను అమెరికా నుంచి కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనకు రక్షణ శాఖ మంత్రి పారీకర్ నేతృత్వంలోని రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి […]
Advertisement
సైన్యం ఆధునికీకరణపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో రూ.20 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ‘మేకిన్ ఇండియా’ విధానంలో భాగంగా ఆర్మీ అవసరాల కోసం ఆయా పరికరాల తయారీని భారత్‌లోనే చేపడతారు. రక్షణ శాఖ దీనికి ఆమోదం తెలిపింది. ఎం-777 రకానికి చెందిన 145 హోవిట్జర్ ఆర్టిలరీ తుపాకులను అమెరికా నుంచి కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనకు రక్షణ శాఖ మంత్రి పారీకర్ నేతృత్వంలోని రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి ఆమోదం తెలిపింది. కామోవ్ 228 రకానికి చెందిన 200 హెలికాప్టర్లు, బోయింగ్ 777 రకానికి చెందిన రెండు విమానాలు, వీవీఐపీల కోసం 300 ఎయిర్‌క్రాఫ్టులు, ఆరు బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Advertisement