లాటరీపై రేపటి నుంచే శ్రీవారి సేవా టికెట్లు

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఇక నుంచి లాటరీ పద్ధతిలో కేటాయించనున్నట్లు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయా బ్యాంకు ద్వారా చేస్తున్న కరెంట్‌ బుకింగ్‌ ఆర్జిత, వారపు సేవా టికెట్ల జారీలో అక్రమాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో టీటీడీ ఈవో సాంబశివరావు ఆదేశాల మేరకు కరెంట్‌ బుకింగ్‌ విధానానికి స్వస్తి పలికామని చెప్పారు. నిత్యం మంజూరు చేసే.. సుప్రభాతం-100, కల్యాణోత్సవం-80, వారపు సేవలైన విశేషపూజ-150, సహస్రకలశాభిషేకం-25, తిరుప్పావడ- 25, […]

Advertisement
Update:2015-05-14 19:14 IST
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఇక నుంచి లాటరీ పద్ధతిలో కేటాయించనున్నట్లు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయా బ్యాంకు ద్వారా చేస్తున్న కరెంట్‌ బుకింగ్‌ ఆర్జిత, వారపు సేవా టికెట్ల జారీలో అక్రమాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో టీటీడీ ఈవో సాంబశివరావు ఆదేశాల మేరకు కరెంట్‌ బుకింగ్‌ విధానానికి స్వస్తి పలికామని చెప్పారు. నిత్యం మంజూరు చేసే.. సుప్రభాతం-100, కల్యాణోత్సవం-80, వారపు సేవలైన విశేషపూజ-150, సహస్రకలశాభిషేకం-25, తిరుప్పావడ- 25, నిజపాద దర్శనం- 100 టికెట్లను మాత్రమే లాటరీ ద్వారా భక్తులకు కేటాయిస్తామని తెలిపారు. ఈ టికెట్ల కేటాయింపునకు సంబంధించి ఆయా ముందు రోజుల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు సీఆర్వో వద్ద ఉన్న విజయా బ్యాంకు కౌంటర్‌లో పేరు, చిరునామా నమోదు చేసుకోవాలని సూచించారు. సాయంత్రం 6 గంటలకు లాటరీ నిర్వహించి మంజూరైనా కాకపోయినా… వివరాలను భక్తుల సెల్‌ఫోన్‌కు ఎస్సెమ్మెస్‌ ద్వారా తెలియజేస్తామన్నారు.
Tags:    
Advertisement

Similar News