జూన్ నుంచి ఇంటి వద్దకే పింఛన్లు
వచ్చేనెల నుంచి లబ్ధిదారులకు ఇంటివద్దే పింఛన్లను పంపిణీ చేయనున్నట్టు ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని వెల్లడించారు. కలెక్టరేట్‌లో తనను కలిసిన విలేకరులతో ఆమె మాట్లాడారు. పింఛన్ల పంపిణీ కోసం గ్రామానికి ఒకటి చొప్పున 13 వేల గ్రామాలకు ట్యాబ్‌లు సరఫరా చేస్తామన్నారు. ప్రస్తుతం ప్రతినెలా 41 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామని, గతంలో తొలగించిన వారిలో 80 వేల మందిని అర్హులుగా గుర్తించామని వారికి కూడా పింఛన్లు ఇస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల గృహాలు […]
Advertisement
వచ్చేనెల నుంచి లబ్ధిదారులకు ఇంటివద్దే పింఛన్లను పంపిణీ చేయనున్నట్టు ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని వెల్లడించారు. కలెక్టరేట్‌లో తనను కలిసిన విలేకరులతో ఆమె మాట్లాడారు. పింఛన్ల పంపిణీ కోసం గ్రామానికి ఒకటి చొప్పున 13 వేల గ్రామాలకు ట్యాబ్‌లు సరఫరా చేస్తామన్నారు. ప్రస్తుతం ప్రతినెలా 41 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామని, గతంలో తొలగించిన వారిలో 80 వేల మందిని అర్హులుగా గుర్తించామని వారికి కూడా పింఛన్లు ఇస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల గృహాలు నిర్మించేందుకు ప్రతిపాదనలను మంత్రి మండలి ఆమోదం కోసం పంపినట్టు మంత్రి తెలిపారు. నిర్మాణ విధివిధానాలను మంత్రిమండలిలో నిర్ణయించనున్నట్టు చెప్పారు. హుద్‌హుద్ తుఫాన్ బాధితుల కోసం ఉత్తరాంధ్రలో రూ. 500 కోట్లతో పదివేల గృహాలు నిర్మించనున్నట్టు మంత్రి చెప్పారు.
Advertisement