చంద్రబాబును నిరాశ పరిచిన లోకేష్ యాత్ర!
వచ్చే ఎన్నికల నాటికి లోకేష్‌ని టీడిపి అగ్ర నాయకుడిగా రూపొందించాలనుకుంటున్న చంద్రబాబుకు నిరాశే ఎదురయింది. ఇటీవల కాలంలో లోకేష్‌ని టీడిపిలో తన తరువాత స్థానంలో నిలబెట్టడానికి చంద్రబాబు చెయ్యని ప్రయత్నంలేదు. పార్టీ కార్యకర్తలను దగ్గర చెయ్యడానికి పార్టీ సంక్షేమ కార్యక్రమాలకు ఇన్‌ఛార్జీగా నియమించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్నీ లోకేష్‌కి అప్పగించారు. అనధికారికంగా మంత్రుల పనితీరును సమీక్షించే భాధ్యతను లోకేష్ తీసుకున్నాడు. అనేక ప్రభుత్వ వ్యవహారాలు ఆయన కనుసన్నల్లో నడుస్తున్నాయి. ఈ నేపధ్యంలో పెట్టుబడుల కోసం అమెరికా […]
వచ్చే ఎన్నికల నాటికి లోకేష్‌ని టీడిపి అగ్ర నాయకుడిగా రూపొందించాలనుకుంటున్న చంద్రబాబుకు నిరాశే ఎదురయింది. ఇటీవల కాలంలో లోకేష్‌ని టీడిపిలో తన తరువాత స్థానంలో నిలబెట్టడానికి చంద్రబాబు చెయ్యని ప్రయత్నంలేదు. పార్టీ కార్యకర్తలను దగ్గర చెయ్యడానికి పార్టీ సంక్షేమ కార్యక్రమాలకు ఇన్‌ఛార్జీగా నియమించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్నీ లోకేష్‌కి అప్పగించారు. అనధికారికంగా మంత్రుల పనితీరును సమీక్షించే భాధ్యతను లోకేష్ తీసుకున్నాడు. అనేక ప్రభుత్వ వ్యవహారాలు ఆయన కనుసన్నల్లో నడుస్తున్నాయి. ఈ నేపధ్యంలో పెట్టుబడుల కోసం అమెరికా ప్రయాణం పెట్టుకున్నాడు. ఒబామాని కలిసి, చర్చలు జరుపుతాడన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే పార్టీ ఫండ్ చెల్లించి ఒబామాను కలుసుకున్న విషయం సోషల్ మీడియాలో బహిర్గతం అయ్యాక లోకేష్, ఒబామాల సమావేశ సన్నివేశం నవ్వుల పాలయింది. అలాగే పెట్టుబడులు కూడా ఏమీ తీసుకువచ్చిన దాఖలాలు లేవు. కొన్ని వేల గ్రామాలను ప్రవాస భారతీయులు దత్తత తీసుకున్నారని తెలుగుదేశం వారు గర్వంగా చెబుతున్నారు. అయితే ఏఏ గ్రామాలు దత్తత తీసుకున్నారు, ఎవ్వరు దత్తత తీసుకున్నారు అని ప్రశ్నిస్తున్న వారికి టీడిపి నుండి మౌనమే సమాధానంగా నిలిచింది.
ఇదే సమయంలో తెలంగాణా నుండి పెట్టుబడుల కొసం అమెరికా వెళ్ళిన తెలంగాణా మంత్రి కేటీఆర్ వేల కోట్ల రుపాయల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకురావడం, ప్రపంచంలోనే అతి పెద్దదైన గూగుల్ క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయ్యడానికి ఒప్పందం కుదుర్చుకోవడం చంద్రబాబును తీవ్రంగా నిరాశ పరిచింది. కేటీఆర్, లోకేష్ పెట్టుబడుల కోసం ఒకేసారి అమెరికా వెళ్ళడం, లోకేష్ ఉత్తి చేతులతో తిరిగిరావడం, కేటీఆర్ సక్సెస్ కావడం చంద్రబాబు ఆశలపై నీళ్ళు చల్లినట్లైంది.