తల్లుల స్వర్గధామం నార్వే!

ప్రపంచంలో తల్లులకు స్వర్గధామం ఏ దేశమో తెలుసా? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం.. నార్వే. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ‘సేవ్ ద చిల్డ్రన్’ ఈ ఏడాది విడుదల చేసిన మదర్ ఇండెక్స్లో ఈ విషయం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 179 దేశాలలోని గర్భిణులకు మెటర్నిటీ వైద్యం, విద్య, కుటుంబ ఆదాయం తదితర విషయాల ఆధారంగా ఈ సర్వే నిర్వహించింది. ఈ విషయంలో నూటికి నూరు మార్కులతో నార్వే తొలిస్థానంలో నిలిచింది. గతేడాది ఇదే సర్వేలో మొదటిస్థానంలో నిలిచిన ఫిన్లాండ్ ను […]

Advertisement
Update:2015-05-08 18:55 IST
ప్రపంచంలో తల్లులకు స్వర్గధామం ఏ దేశమో తెలుసా? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం.. నార్వే. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ‘సేవ్ ద చిల్డ్రన్’ ఈ ఏడాది విడుదల చేసిన మదర్ ఇండెక్స్లో ఈ విషయం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 179 దేశాలలోని గర్భిణులకు మెటర్నిటీ వైద్యం, విద్య, కుటుంబ ఆదాయం తదితర విషయాల ఆధారంగా ఈ సర్వే నిర్వహించింది. ఈ విషయంలో నూటికి నూరు మార్కులతో నార్వే తొలిస్థానంలో నిలిచింది. గతేడాది ఇదే సర్వేలో మొదటిస్థానంలో నిలిచిన ఫిన్లాండ్ ను పక్కకు నెట్టి ఈ ఘనత సాధించడం విశేషం. దీంతో ఫిన్లాండ్ రెండోస్థానానికి పడిపోయింది. ప్రపంచపు పెద్దన్నగా, అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికా ఈ విషయంలో 33 స్థానానికి ప‌రిమిత‌మైంది. గతేడాది ఈ విషయంలో యూఎస్ ఈ జాబితాలో 31 స్థానం దక్కించుకుంది. ఈ జాబితాలో తొలిపది దేశాల్లో ఆస్ట్రేలియా ఒక్కటే ఐరోపాయేతర దేశం కావడం గమనార్హం. ఈ జాబితాలో కెనడా 20, ఫ్రాన్స్ 23, బ్రిటన్ 24వ స్థానంలో నిలిచాయి. ఇక ఇండియా విషయానికి వస్తే 179 దేశాల్లో 140వ స్థానం దక్కించుకుంది. ఇండియా అందుకున్న ర్యాంకింగ్ ఇక్కడ గర్భిణులకు అందుతున్న సదుపాయాలను చెప్పకనే చెబుతున్నాయి.
Advertisement

Similar News