డ్వాక్రా సంఘాలతో జెనరిక్ మందుల షాపులు
తెలుగుదేశం కార్యకర్తల నిరుద్యోగాన్ని క్రమంగా తీర్చడానికి ఏపీ సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే డ్వాక్రా సంఘాల పేరుతో ఇసుక క్వారీలను స్వాధీనం చేసుకున్న తెలుగుదేశం శ్రేణులకు మరో దందా అప్పగించడానికి ముఖ్యమంత్రి మార్గం వేస్తున్నారు. డ్వాక్రా మహిళల రుణమాఫీ చేస్తానన్న హామీ నెరవేర్చకపోవడంతో వారు ఆగ్రహంతో ఉన్నారు. అందుకే మండలానికి ఒక జెనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేసి వాటి నిర్వహణను డ్వాక్రా సంఘాలకు అప్పగిస్తానని ప్రకటించారు చంద్రబాబు. ఇప్పటికే అక్కడక్కడా ఏర్పాటు చేసిన జెనరిక్ […]
Advertisement
తెలుగుదేశం కార్యకర్తల నిరుద్యోగాన్ని క్రమంగా తీర్చడానికి ఏపీ సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే డ్వాక్రా సంఘాల పేరుతో ఇసుక క్వారీలను స్వాధీనం చేసుకున్న తెలుగుదేశం శ్రేణులకు మరో దందా అప్పగించడానికి ముఖ్యమంత్రి మార్గం వేస్తున్నారు. డ్వాక్రా మహిళల రుణమాఫీ చేస్తానన్న హామీ నెరవేర్చకపోవడంతో వారు ఆగ్రహంతో ఉన్నారు. అందుకే మండలానికి ఒక జెనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేసి వాటి నిర్వహణను డ్వాక్రా సంఘాలకు అప్పగిస్తానని ప్రకటించారు చంద్రబాబు. ఇప్పటికే అక్కడక్కడా ఏర్పాటు చేసిన జెనరిక్ మందుల షాపులు డాక్టర్ల ఆదరణ లేక నీరసించిపోతున్నాయి. కమిషన్లకు అలవాటు పడ్డ మన డాక్టర్లు పెద్ద పెద్ద కంపెనీలకు చెందిన ధర ఎక్కువ మందుల్నే పేషెంట్లకు రాస్తున్నారు. కమిషన్లు రాని పేదలకు ఉపయోగ పడే జెనరిక్ మందులు సిఫార్సు చేస్తారా…జెనరిక్ మందులే సూచించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డాక్టర్లకు కట్టడి చేయగలరా ?
Advertisement