బ‌తికున్న నిజాం... కేసీఆర్‌:: :మోత్కుప‌ల్లి

తెలంగాణ రాష్ట్ర స‌మితి వైట్ కాల‌ర్ పార్టీ అని, సంప‌న్నుల‌కు అనువుగానే ఆ  పార్టీ నిర్ణ‌యాలు ఉంటాయ‌ని తెలుగుదేశం నాయ‌కుడు మోత్కుప‌ల్లి న‌ర్సింహులు విమ‌ర్శించారు. 850 మంది రైతులు చ‌నిపోతే అస‌లు ఆ విష‌యాన్నే ప‌ట్టించుకోకుండా రైతు బాంధ‌వుడిన‌ని చెప్పుకోవ‌డానికి కేసీఆర్ సిగ్గు ప‌డ‌డం లేద‌ని ఆయ‌న అన్నారు. 1250 మంది తెలంగాణ కోసం బ‌లిప‌శువులై పోతే వారి కుటుంబాల‌ను గాలికొదిలేసిన చ‌రిత్ర కేసీఆర్‌ద‌ని ఆయ‌న అన్నారు. కేసీఆర్ అంటే మోసానికి మారుపేర‌ని, ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ఉండ‌డం […]

Advertisement
Update:2015-04-24 04:29 IST
బ‌తికున్న నిజాం... కేసీఆర్‌:: :మోత్కుప‌ల్లి
  • whatsapp icon
తెలంగాణ రాష్ట్ర స‌మితి వైట్ కాల‌ర్ పార్టీ అని, సంప‌న్నుల‌కు అనువుగానే ఆ పార్టీ నిర్ణ‌యాలు ఉంటాయ‌ని తెలుగుదేశం నాయ‌కుడు మోత్కుప‌ల్లి న‌ర్సింహులు విమ‌ర్శించారు. 850 మంది రైతులు చ‌నిపోతే అస‌లు ఆ విష‌యాన్నే ప‌ట్టించుకోకుండా రైతు బాంధ‌వుడిన‌ని చెప్పుకోవ‌డానికి కేసీఆర్ సిగ్గు ప‌డ‌డం లేద‌ని ఆయ‌న అన్నారు. 1250 మంది తెలంగాణ కోసం బ‌లిప‌శువులై పోతే వారి కుటుంబాల‌ను గాలికొదిలేసిన చ‌రిత్ర కేసీఆర్‌ద‌ని ఆయ‌న అన్నారు. కేసీఆర్ అంటే మోసానికి మారుపేర‌ని, ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ఉండ‌డం వ‌ల్ల పేద‌ల‌కు ఒరిగిందేమీ లేద‌ని… ఇక ముందు కూడా ఉండ‌ద‌ని ఆయ‌న అన్నారు. బ‌తికున్న నిజాంగా కేసీఆర్‌ను ఆయ‌న అభివ‌ర్ణించారు. అల్లుడు మిష‌న్ కాక‌తీయ పేరుతోను, కొడుకు వాట‌ర్ గ్రిడ్ పేరుతోను నిధులు దండుకుంటున్నార‌ని, కేసీఆర్ వ‌ల్ల తెలంగాణ బాగుప‌డుతుందో లేదో కాని ఆయ‌న కుటుంబం మాత్రం సంప‌ద‌ను కూడ‌బెట్టుకుంటుంద‌ని ఆయ‌న అన్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో కేసీఆర్‌ను రాజ‌కీయ స‌మాధి చేయ‌డానికి ప్ర‌జ‌లంతా సిద్ధంగా ఉన్నార‌ని మోత్కుప‌ల్లి ఆరోపించారు.
Tags:    
Advertisement

Similar News