ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో బాలికలదే పైచేయి
హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. మొత్తం 4,31,363 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 2.39,954 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను విడుదల చేస్తూ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఈ విషయం చెప్పారు. 71 శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉండగా 43 శాతంతో నల్గొండ జిల్లా చివరి స్థానంలో ఉందని ఆయన తెలిపారు. పరీక్ష రాసిన మొత్తం విద్యార్థుల్లో 55.60 శాతం మంది పాసైనట్టు ఆయన […]
Advertisement
హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. మొత్తం 4,31,363 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 2.39,954 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను విడుదల చేస్తూ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఈ విషయం చెప్పారు. 71 శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉండగా 43 శాతంతో నల్గొండ జిల్లా చివరి స్థానంలో ఉందని ఆయన తెలిపారు. పరీక్ష రాసిన మొత్తం విద్యార్థుల్లో 55.60 శాతం మంది పాసైనట్టు ఆయన చెప్పారు. బాలికల ఉత్తీర్ణత శాతం 61.68 శాతం ఉందని తెలిపారు. ఈ నెల 26 నుంచి మార్కుల మెమోలు జారీ చేస్తారని, ఇందులో తప్పులేమైనా ఉంటే సవరించుకునేందుకు మే 22 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. మే 25 నుంచి జూన్ 1వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని, ఆన్‌లైన్‌లో ఫీజులు కూడా చెల్లించుకోవచ్చని చెప్పారు.
Advertisement