ఎన్‌కౌంటర్లపై ఎన్‌హెచ్చార్సీ విచారణ!
శేషాచలం, నల్గొండ జిల్లాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లతోపాటు పెండింగ్ ఉన్న వివిధ కేసులపై వాదనలు వినడానికి హైదరాబాద్ వచ్చిన జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్చార్సీ) ఈరోజు వివిధ కేసుల్లో వాదనలు వినడం మొదలెట్టింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో ఈ సంస్థ ప్రతినిధులు జేబీ బాలకృష్ణ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిషన్ బాధితుల వాదనలు వింటోంది. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి వచ్చిన 34 కేసులను విచారిస్తారు. గురు, శుక్రవారాల్లో కూడా కమిషన్ ఇక్కడే ఉండి […]
Advertisement
శేషాచలం, నల్గొండ జిల్లాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లతోపాటు పెండింగ్ ఉన్న వివిధ కేసులపై వాదనలు వినడానికి హైదరాబాద్ వచ్చిన జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్చార్సీ) ఈరోజు వివిధ కేసుల్లో వాదనలు వినడం మొదలెట్టింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో ఈ సంస్థ ప్రతినిధులు జేబీ బాలకృష్ణ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిషన్ బాధితుల వాదనలు వింటోంది. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి వచ్చిన 34 కేసులను విచారిస్తారు. గురు, శుక్రవారాల్లో కూడా కమిషన్ ఇక్కడే ఉండి కమిషన్ బహిరంగ విచారణ చేపడుతుంది.ఎస్పీ, ఎస్టీ చట్టం కింద నమోదైన మొత్తం 61 కేసులపై బుధవారం బహిరంగ విచారణ జరుపుతున్నారు. పర్యటన చివరి రోజున అంటే శుక్రవారం వారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు ఉన్నతాధికారులు, కారదర్శులతో సమావేశమవుతారు.
Advertisement