కోల్‌క‌త్తాలో రూ. 22 కోట్ల ఆంధ్ర‌ ఎర్రచందనం స్వాధీనం

కోల్‌క‌తా:  పశ్చిమబెంగాల్‌లో 11 టన్నుల ఏ గ్రేడ్‌ ఎర్రచందనం దుంగల్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పోలీసులు సీజ్‌ చేశారు. తమిళనాడుకు చెందిన మాజీ మంత్రికి చెందిన గోడౌన్‌లోనే వాటిని గుర్తించారు. చైనా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ఈ దుంగల విలువ దాదాపు రూ.22 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయినవారి కాల్‌డేటా ఆధారంగా 16 మంది స్మగ్లింగ్‌ సూత్రధారులను టాస్క్‌ఫోర్స్‌ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో ఆ 16 మంది ఇచ్చిన సమాచారంతో ఈ […]

Advertisement
Update:2015-04-20 00:34 IST
కోల్‌క‌తా: పశ్చిమబెంగాల్‌లో 11 టన్నుల ఏ గ్రేడ్‌ ఎర్రచందనం దుంగల్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పోలీసులు సీజ్‌ చేశారు. తమిళనాడుకు చెందిన మాజీ మంత్రికి చెందిన గోడౌన్‌లోనే వాటిని గుర్తించారు. చైనా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ఈ దుంగల విలువ దాదాపు రూ.22 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయినవారి కాల్‌డేటా ఆధారంగా 16 మంది స్మగ్లింగ్‌ సూత్రధారులను టాస్క్‌ఫోర్స్‌ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో ఆ 16 మంది ఇచ్చిన సమాచారంతో ఈ ఎర్ర‌చందనం ఆచూకీ దొరికింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పెద్ద తలకాయల‌ను కూడా గుర్తించిన‌ట్టు తెలిసింది. ఇప్పటికే తమిళనాడుకు చెందిన ఓ మాజీ మంత్రిని అరెస్టు చేసిన పోలీసులు.. ఏపీకి చెందిన ఓ మాజీ మంత్రిని అదుపులోకి తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. అంతేకాకుండా స్మ‌గ్లింగ్‌లో ఏపీ, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో ఎవ‌రికి ప్ర‌మేయం ఉంద‌న్న విష‌యంపై కూడా ఆరా తీస్తున్నారు.
Tags:    
Advertisement

Similar News