విగ్రహం ధ్వంసం కేసు: దురుద్దేశంతోనే దుశ్చర్య

2022లో ముంబయిలోనూ ఇదే తరహా ఘటనలకు పాల్పడ్డ నిందితుడు .రాష్ట్రంలో కలకలం సృష్టించిన విగ్రహం విధ్వంసం కేసు

Advertisement
Update:2024-10-17 10:26 IST

సికింద్రాబాద్‌లో సంచలనం సృష్టించిన విగ్రహం ధ్వంసం కేసులో నిందితుడు ఇతర మతాలపై దురుద్దేశంతోనే దుశ్చర్యకు పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఈ నెల 14వ తేదీన సికింద్రాబాద్‌లోనిమోండా మార్కెట్‌  కుమ్మరిగూడలోని ఒక ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించిన ముంబయికి చెందిన వ్యక్తి వ్యవహారంలో పోలీసులు అన్నీకోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

ముంబయిలోని ముమ్రా ప్రాంతానికి చెందిన ఈ వ్యక్తి బీఏ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. 2022లో ముంబయిలోనూ ఇదే తరహా ఘటనలకు నిందితుడు పాల్పడ్డాడు. దీంతో మహారాష్ట్ర పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. నిందితుడు అక్టోబర్‌ మొదటి వారంలో హైదరాబాద్‌కు వచ్చి రెజిమెంటల్‌ బజార్‌ మెట్రో పోలీస్‌ హోటల్‌లో నిర్వ హిస్తున్న వ్యక్తిత్వ వికాసం వర్క్‌షాప్‌ క్లాసులకు హాజరవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 14న కుమ్మరిగూడలో ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. స్థానికులు ఆయనకు దేహశుద్ధి చేశారు. పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. రెజిమెంటల్‌ బజార్‌ మెట్రో పోలీస్‌ హోటల్‌లో వ్యక్తిత్వ వికాసం పేరుతో సాగుతున్న ఇంగ్లీష్‌ క్లాస్‌లపై పోలీసులు దృష్టి సారించారు. ఈ క్లాసులకు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన యువకులు హాజరవుతున్నట్టు గుర్తించారు. పర్మిషన్‌ లేకుండా క్లాస్ లు నిర్వ హిస్తున్నట్లు పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు. ఉత్తర మండలం డీసీపీ సికింద్రాబాద్‌లోని వివిధ హోటల్స్‌, లాడ్జిల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, రిజిస్ట్రార్లు క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. ఎప్పుడు అడిగినా పోలీసులకు చూపెట్టాలని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News