భారత్ సాయానికి అనుమతించిన పాక్..

శత్రువులంటే ఆ ఇంటిమీద కాకి కూడా ఈ ఇంటిపై వాలకూడదంటారు. ఇప్పటి వరకూ పాకిస్తాన్ కూడా భారత్ విషయంలో అలాగే ఉంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ కి పంపించే సాయంపై మాత్రం కాస్త మనసు కరిగించుకుంది. భారత్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లాల్సిన గోధుమల్ని మధ్యలోనే ఆపేసిన పాక్ ఇప్పుడా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. లారీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆప్ఘన్ ఆకలి కేకల్ని చల్లార్చాలనుకుంటున్న భారత్ కి బాసటగా నిలిచింది. తాలిబన్ల చెరలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తీవ్ర […]

Advertisement
Update:2021-11-13 04:39 IST

శత్రువులంటే ఆ ఇంటిమీద కాకి కూడా ఈ ఇంటిపై వాలకూడదంటారు. ఇప్పటి వరకూ పాకిస్తాన్ కూడా భారత్ విషయంలో అలాగే ఉంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ కి పంపించే సాయంపై మాత్రం కాస్త మనసు కరిగించుకుంది. భారత్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లాల్సిన గోధుమల్ని మధ్యలోనే ఆపేసిన పాక్ ఇప్పుడా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. లారీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆప్ఘన్ ఆకలి కేకల్ని చల్లార్చాలనుకుంటున్న భారత్ కి బాసటగా నిలిచింది.

తాలిబన్ల చెరలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తీవ్ర ఆహార సంక్షోభం ఎదుర్కొంటోంది. తిండిగింజలు లేక, పని దొరక్క.. ప్రజలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. స్థానికంగా ఆహార పదార్ధాల లభ్యత లేకపోవడంతో దిగుమతులపైనే ఆప్ఘన్ ఆధారపడాల్సి వస్తోంది. అయితే తాలిబన్లకు సాయం చేయడానికి అంతర్జాతీయ సమాజం వెనకడుగు వేసింది. ఈ సందర్భంలో భారత్ పెద్దమనసుతో 50వేల మెట్రిక్ టన్నుల గోధుమల్ని రోడ్డు మార్గం ద్వారా ఆఫ్ఘన్ కు పంపించే ఏర్పాట్లు చేసింది. కానీ ఆ ట్రక్కుల్ని వాఘా సరిహద్దు వద్ద పాక్ ఆపేసింది. తన భూభాగాన్ని వినియోగించుకోడానికి భారత్ కి అనుమతివ్వబోమని తేల్చి చెప్పింది.

కానీ ఆఫ్ఘన్ లో ఉంది తాలిబన్ ప్రభుత్వం, పరోక్షంగా తాలిబన్లకు పాక్ సాయం అందిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో తిండిగింజలను అడ్డుకోవడం సరికాదని పైక్ పై ఒత్తిడి పెరిగింది. దీంతో భారత్ సాయాన్ని ఆఫ్ఘన్ పంపించేందుకు సమ్మతిస్తున్నట్టు ప్రకటించారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ”ఆఫ్ఘన్ సోదరుల కోరికను మన్నిస్తున్నాం, భారత్ అందిస్తున్న సాయాన్ని మా దేశం ద్వారా పంపించేందుకు సమ్మతిస్తున్నాం” అంటూ ఇమ్రాన్ ఖాన్ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు భారత్ నుంచి వచ్చే ఆహార ధాన్యాల దిగుమతులపై ఇదివరకే పాక్ ఆంక్షలు విధించడంతో అక్కడ కూడా ఆహార కొరత వేధిస్తోంది.

Tags:    
Advertisement

Similar News