గాడ్ ఫాదర్ షూటింగ్ అప్ డేట్స్
ప్రస్తుతం గాడ్ ఫాదర్ అనే సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఆ సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ మొదలైంది. చిరంజీవి సెట్స్ లో జాయిన్ అయ్యారు. సినిమా షూటింగ్ లో భాగంగా కొత్త షెడ్యూల్స్ మొదలవ్వడం కామన్. కానీ గాడ్ ఫాదర్ కొత్త షెడ్యూల్ మొదలవ్వడం మాత్రం చాలా ప్రత్యేకం. మరీ ముఖ్యంగా మెగాఫ్యాన్స్ పండగ చేసుకునే సందర్భం. దీనికి ఓ కారణం ఉంది. రీసెంట్ గా చిరంజీవికి చిన్న సర్జరీ జరిగింది. మణికట్టు వద్ద శస్త్రచికిత్స నిర్వహించారు. […]
ప్రస్తుతం గాడ్ ఫాదర్ అనే సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఆ సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ మొదలైంది. చిరంజీవి సెట్స్ లో జాయిన్ అయ్యారు. సినిమా షూటింగ్ లో భాగంగా కొత్త షెడ్యూల్స్ మొదలవ్వడం కామన్. కానీ గాడ్ ఫాదర్ కొత్త షెడ్యూల్ మొదలవ్వడం మాత్రం చాలా ప్రత్యేకం. మరీ ముఖ్యంగా మెగాఫ్యాన్స్ పండగ చేసుకునే సందర్భం. దీనికి ఓ కారణం ఉంది.
రీసెంట్ గా చిరంజీవికి చిన్న సర్జరీ జరిగింది. మణికట్టు వద్ద శస్త్రచికిత్స నిర్వహించారు. ఈమధ్య చాలా సందర్భాల్లో ఆయన చేతికి కట్టుతోనే కనిపించారు. అలా సర్జరీ నుంచి పూర్తిగా కోలుకున్న చిరంజీవి, గాడ్ ఫాదర్ సినిమాను స్టార్ట్ చేశారు. తను ఫిట్ గా ఉన్న విషయాన్ని చెప్పారు. చిరంజీవి సెట్స్ పైకి వచ్చారనే వార్త తెలిసిన వెంటనే మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు.
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తోంది గాడ్ ఫాదర్ సినిమా. మోహన్ రాజా డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. చిరంజీవితో పాటు మరికొంతమంది ఆర్టిస్టులతో టాకీ సన్నివేశాలు తీశారు.