చిరంజీవి నుంచి క్రేజీ ప్రకటన
చిరంజీవి కొత్త సినిమా హంగామా చేస్తోంది. ఆచార్య సినిమా కంటే లూసిఫర్ రీమేక్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్. ఇప్పుడీ హంగామాను డబుల్ చేయబోతున్నారు చిరు. తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా టైటిల్ ను ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. మలయాళంలో సూపర్ హిట్టయిన లూసిఫర్ సినిమాను, మోహన్ రాజా దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేస్తున్నారు చిరంజీవి. ఈ సినిమాకు తెలుగులో కూడా లూసిఫర్ అనే టైటిల్ నే పెట్టారంటూ గతంలో వార్తలొచ్చాయి. అయితే తాజాగా గాడ్ […]
చిరంజీవి కొత్త సినిమా హంగామా చేస్తోంది. ఆచార్య సినిమా కంటే లూసిఫర్ రీమేక్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్. ఇప్పుడీ హంగామాను డబుల్ చేయబోతున్నారు చిరు. తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా టైటిల్ ను ప్రకటించే ఆలోచనలో ఉన్నారు.
మలయాళంలో సూపర్ హిట్టయిన లూసిఫర్ సినిమాను, మోహన్ రాజా దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేస్తున్నారు చిరంజీవి. ఈ సినిమాకు తెలుగులో కూడా లూసిఫర్ అనే టైటిల్ నే పెట్టారంటూ గతంలో వార్తలొచ్చాయి. అయితే తాజాగా గాడ్ ఫాదర్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గాడ్ ఫాదర్ టైటిల్ నే దాదాపుగా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెలల గాడ్ ఫాదర్ టైటిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది.
నిన్న ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్‌గుడ్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై నిర్మితమవుతోన్న ఈ సినిమా షెడ్యూల్ భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణతో ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవిపై ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఆల్రెడీ ఓ పాట కంపోజ్ చేశాడు కూడా.