తన ప్రేమకథ బయటపెట్టిన రానా

తాజాగా తన ప్రేమ విషయాన్ని రానా బయటపెట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో పుట్టి, ముంబయిలో పెరిగిన మిహికా బజాజ్ ను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు రానా. మిహికా తనకు ఎక్కడ పరిచయమైంది, ఆమెకు తను ఎలా ప్రపోజ్ చేశాడనే విషయాల్ని తాజాగా రానా బయటపెట్టాడు. “వెంకీ బాబాయ్ కూతురు అశ్రిత, మిహిక క్లాస్ మేట్స్. తను మా ఇంటికి రెగ్యులర్ గా వచ్చేది. చాలా ఏళ్లుగా మిహికా నాకు తెలుసు. కానీ ఈమధ్య కలుసుకొని చాన్నాళ్లయింది. […]

Advertisement
Update:2020-05-23 12:28 IST
తన ప్రేమకథ బయటపెట్టిన రానా
  • whatsapp icon

తాజాగా తన ప్రేమ విషయాన్ని రానా బయటపెట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో పుట్టి, ముంబయిలో పెరిగిన మిహికా బజాజ్ ను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు రానా. మిహికా తనకు ఎక్కడ పరిచయమైంది, ఆమెకు తను ఎలా ప్రపోజ్ చేశాడనే విషయాల్ని తాజాగా రానా బయటపెట్టాడు.

“వెంకీ బాబాయ్ కూతురు అశ్రిత, మిహిక క్లాస్ మేట్స్. తను మా ఇంటికి రెగ్యులర్ గా వచ్చేది. చాలా ఏళ్లుగా మిహికా నాకు తెలుసు. కానీ ఈమధ్య కలుసుకొని చాన్నాళ్లయింది. అలా లాంగ్ గ్యాప్ తర్వాత మిహికాను చూసిన తరువాత నాలో ఫీలింగ్స్ కలిగాయి. కొన్నాళ్లు ఇద్దరం మాట్లాడుకున్నాం. ఓ రోజంతా ఆలోచించాను. మరుసటి రోజు ఫోన్ చేసి ప్రేమిస్తున్న విషయం చెప్పేశాను. ఆ తర్వాత కొన్ని రోజులకు కలుసుకున్నాం. ఇక అక్కడ్నుంచి మా ప్రేమ ప్రయాణం మొదలైంది.”

ఇలా తన ప్రేమకథను విపులంగా బయటపెట్టాడు రానా. 2 రోజుల కిందట తనకు, మిహికాకు రోకా ఫంక్షన్ అయిందని తెలిపిన రానా.. మిహికా వేలికి ఇంకా ఉంగరం తొడగలేదని స్పష్టంచేశాడు. త్వరలోనే పెళ్లి డేట్ కూడా ఎనౌన్స్ చేస్తానంటున్నాడు ఈ హీరో.

Tags:    
Advertisement

Similar News