యాప్ పెట్టే ఆలోచనలో మహేష్ బాబు

ఇప్పుడంతా డిజిటల్ స్ట్రీమింగ్స్ మీద పడ్డారు. జనాలంతా అటువైపు మొగ్గుచూపడం, లాభాలు కూడా అదే స్థాయిలో వస్తుండడంతో లోకల్ టేస్ట్ కు తగ్గట్టు యాప్స్ పెడితే బాగుంటుందని చాలామంది భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆహా అనే యాప్ వచ్చింది. అల్లు అరవింద్, మరికొంతమంది కలిసి పెట్టారు దీన్ని. త్వరలోనే దిల్ రాజు కూడా ఈ రంగంలోకి రాబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పుడు మహేష్ బాబు పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. అవును.. మహేష్ బాబు కూడా ఓటీటీలోకి […]

Advertisement
Update:2020-04-14 09:30 IST

ఇప్పుడంతా డిజిటల్ స్ట్రీమింగ్స్ మీద పడ్డారు. జనాలంతా అటువైపు మొగ్గుచూపడం, లాభాలు కూడా అదే స్థాయిలో వస్తుండడంతో లోకల్ టేస్ట్ కు తగ్గట్టు యాప్స్ పెడితే బాగుంటుందని చాలామంది భావిస్తున్నారు.

ఇందులో భాగంగా ఇప్పటికే ఆహా అనే యాప్ వచ్చింది. అల్లు అరవింద్, మరికొంతమంది కలిసి పెట్టారు దీన్ని. త్వరలోనే దిల్ రాజు కూడా ఈ రంగంలోకి రాబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పుడు మహేష్ బాబు పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది.

అవును.. మహేష్ బాబు కూడా ఓటీటీలోకి ఎంటరయ్యే ఆలోచనలో ఉన్నారట. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టు ఒరిజినల్ కంటెంట్ తో ఓ యాప్ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారట. మహేష్ కు ఇప్పటికే మల్టీప్లెక్స్ బిజినెస్ ఉంది. ఇప్పుడిలా ఓటీటీలోకి కూడా ఎంటరవ్వడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ ప్రచారాన్ని మరో వర్గం ఖండిస్తోంది. ఓటీటీ పెట్టడం ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. దానికి చాలా ఖర్చు అవుతుంది. పైగా లాభాలతో సంబంధం లేకుండా ప్రాధమికంగానే పెట్టుబడి చాలా పెట్టాల్సి ఉంటుంది. కరోనా వల్ల ప్రపంచమంతా ఆర్థిక మందగమనంలోకి వెళ్తున్న ఇలాంటి టైమ్ లో మహేష్ అంత పెద్ద రిస్క్ చేయడని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News