బీసీసీఐ బీ-గ్రేడ్ కు పడిపోయిన మిథాలీరాజ్

ఏ-గ్రేడులో స్మృతిమంధానా, హర్మన్ ప్రీత్, పూనమ్ యాదవ్ 2020 క్రికెట్ సీజన్ కు మహిళా క్రికెటర్ల గ్రేడింగ్ ను బీసీసీఐ ఖరారు చేసింది. గత సీజన్ వరకూ 50 లక్షల రూపాయల గ్రేడ్-ఏ క్రికెటర్ గా ఉంటూ వచ్చిన వెటరన్ మిథాలీరాజ్ తొలిసారిగా 30 లక్షల రూపాయల గ్రేడ్-బీకి పడిపోయింది. గ్రేడ్- ఏ కాంట్రాక్టులు సాధించినవారిలో టీ-20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, డాషింగ్ ఓపెనర్ స్మృతి మంథానా, లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ ఉన్నారు. ఈ ముగ్గురికీ.. ఏడాదికి […]

Advertisement
Update:2020-01-18 01:50 IST
  • ఏ-గ్రేడులో స్మృతిమంధానా, హర్మన్ ప్రీత్, పూనమ్ యాదవ్

2020 క్రికెట్ సీజన్ కు మహిళా క్రికెటర్ల గ్రేడింగ్ ను బీసీసీఐ ఖరారు చేసింది. గత సీజన్ వరకూ 50 లక్షల రూపాయల గ్రేడ్-ఏ క్రికెటర్ గా ఉంటూ వచ్చిన వెటరన్ మిథాలీరాజ్ తొలిసారిగా 30 లక్షల రూపాయల గ్రేడ్-బీకి పడిపోయింది.

గ్రేడ్- ఏ కాంట్రాక్టులు సాధించినవారిలో టీ-20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, డాషింగ్ ఓపెనర్ స్మృతి మంథానా, లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ ఉన్నారు. ఈ ముగ్గురికీ.. ఏడాదికి మ్యాచ్ ఫీజులు కాకుండా 50 లక్షల రూపాయల చొప్పున బీసీసీఐ చెల్లించనుంది.

30 లక్షల రూపాయల గ్రేడ్-బీలో చోటు సంపాదించిన క్రికెటర్లలో వన్డే కెప్టెన్ మిథాలీరాజ్ తో పాటు.. జులన్ గోస్వామి, ఏక్తా బిస్త్, రాధా యాదవ్, తాన్యా భాటియా, శిఖా పాండే, జెమీమా రోడ్రిగేస్, దీప్తి శర్మ ఉన్నారు.

ఏడాదికి 10 లక్షల రూపాయల గ్రేడ్- సీలో…వేద కృష్ణమూర్తి, పూనమ్ రౌత్, అనూజా పాటిల్, మానసీ జోషీ, హేమలత, అరుంధతి రెడ్డి, రాజేశ్వరి గయక్వాడ్, పూజా వస్త్రకర్, హర్లీన్ డియోల్, ప్రియ పూనియా, షెఫాలీ వర్మ ఉన్నారు.

38 సంవత్సరాల వెటరన్ మిథాలీరాజ్ గ్రేడ్-బీకి పడిపోయినా…2021 వన్డే ప్రపంచకప్ వరకూ కెప్టెన్ గా కొనసాగనుంది.

ప్రస్తుత ఈ కాంట్రాక్టు 2019 అక్టోబర్ నుంచి 2020 సెప్టెంబర్ వరకూ వర్తిస్తుంది.

Tags:    
Advertisement

Similar News