ఆత్మ హత్యలకు... కారణాలు ఇవేనట!

ప్రపంచ వ్యాప్తం గా ఆత్మ హత్యలు రోజు రోజుకీ పెరిగిపోతూ ఉన్నాయి. అసలు ఈ బలవన్మరణాలకు కారణాలు ఏమిటి? అని చాలా దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. అలా జరిగిన పరిశోధనల్లో ఒకటి ఆసక్తికరమయిన ఫలితాలను వెలికితీసింది. ఆత్మహత్య చేసుకునే ప్రమాదంలో ఎవరు ఎక్కువగా ఉన్నారో గమనించినప్పుడు… శారీరక అనారోగ్యం, గాయాలు కారణం గా పురుషులు ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటారని తేలింది. అయితే ఇవే పరిస్థితుల్లో స్త్రీలు ఉన్నా వారిలో అత్మహత్య చేసుకోవాలనే ఆలోచన పురుషులతో పోల్చి చూసినప్పుడు […]

Advertisement
Update:2019-12-15 03:10 IST

ప్రపంచ వ్యాప్తం గా ఆత్మ హత్యలు రోజు రోజుకీ పెరిగిపోతూ ఉన్నాయి. అసలు ఈ బలవన్మరణాలకు కారణాలు ఏమిటి? అని చాలా దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. అలా జరిగిన పరిశోధనల్లో ఒకటి ఆసక్తికరమయిన ఫలితాలను వెలికితీసింది.

ఆత్మహత్య చేసుకునే ప్రమాదంలో ఎవరు ఎక్కువగా ఉన్నారో గమనించినప్పుడు… శారీరక అనారోగ్యం, గాయాలు కారణం గా పురుషులు ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటారని తేలింది.

అయితే ఇవే పరిస్థితుల్లో స్త్రీలు ఉన్నా వారిలో అత్మహత్య చేసుకోవాలనే ఆలోచన పురుషులతో పోల్చి చూసినప్పుడు తక్కువని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి అనేక సంక్లిష్ట కారణాలు ఉంటాయని, అందులో ఈ కారణాలూ కొన్నని శాస్త్రవేత్తలు అంటున్నారు.

బోస్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (బి యు ఎస్ బి హెచ్) నేతృత్వంలో జరిగిన పరిశోధనా ఫలితాల్ ను ‘జమ సైకియాట్రీ ‘లో ప్రచురించారు. మొత్తం దేశం (డెన్మార్క్) జనాభా నుండి డేటాను తీసుకుని చేసిన మొదటి అధ్యయనం ఇది. అలాగే మొదటగా ఆత్మహత్యను గుర్తించడానికి మెషిన్ లెర్నింగ్ వ్యవస్థను ఉపయోగించింది కూడా ఈ అధ్యనం లోనే.

“ఆత్మహత్యను ఊహించటం చాలా సవాలుతో కూడుకున్న పని. ఎందుకంటే ప్రతి బలవన్మరణం ఒకరి జీవితంలోని అనేక పరస్పర ప్రమాద కారకాల ఫలితమే” అని బి యు ఎస్ బి హెచ్ లోని ఎపిడెమియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జైమీ గ్రాడస్ అన్నారు.

డాక్టర్ గ్రాడస్, ఆమె సహచరులు 1995 నుండి 2015 వరకు దేశంలో ఆత్మహత్య చేసికుని మరణించిన 14,103 మంది వ్యక్తుల ఆరోగ్య చరిత్రలను గమనించారు. ఉద్యోగం లేదా జీవిత భాగస్వామితో సమస్యలు, మానసిక రుగ్మతలు వంటివి పురుషుల ఆత్మహత్యలకు కారణాలని అధ్యయనం తేల్చింది.

Tags:    
Advertisement

Similar News