చిక్కుల్లో మెగా నిర్మాత

టాలీవుడ్ ను మరో వివాదం చుట్టుముట్టుకుంది. మొన్నటికి మొన్న నటి శ్రీరెడ్డి ఇండస్ట్రీని ఉక్కిరిబిక్కిరి చేస్తే, ఇప్పుడా అవకాశాన్ని సునీత బోయ తీసుకుంది. శ్రీరెడ్డి దగ్గుబాటి కుటుంబాన్ని టార్గెట్ చేస్తే, సునీత బోయ మెగా ప్రొడ్యూసర్ ను టార్గెట్ చేసింది. ఆ మెగా ప్రొడ్యూసర్ మరెవరో కాదు బన్నీ వాస్. గీతాఆర్ట్స్-2 బ్యానర్ లో నిర్మాతగా వ్యవహరిస్తున్న బన్నీ వాస్ పై సునీత బోయ తీవ్ర ఆరోపణలు చేసింది. కొన్నాళ్లుగా బన్నీ వాస్ తనను పలు రకాలుగా […]

Advertisement
Update:2019-09-04 15:39 IST

టాలీవుడ్ ను మరో వివాదం చుట్టుముట్టుకుంది. మొన్నటికి మొన్న నటి శ్రీరెడ్డి ఇండస్ట్రీని ఉక్కిరిబిక్కిరి చేస్తే, ఇప్పుడా అవకాశాన్ని సునీత బోయ తీసుకుంది. శ్రీరెడ్డి దగ్గుబాటి కుటుంబాన్ని టార్గెట్ చేస్తే, సునీత బోయ మెగా ప్రొడ్యూసర్ ను టార్గెట్ చేసింది. ఆ మెగా ప్రొడ్యూసర్ మరెవరో కాదు బన్నీ వాస్.

గీతాఆర్ట్స్-2 బ్యానర్ లో నిర్మాతగా వ్యవహరిస్తున్న బన్నీ వాస్ పై సునీత బోయ తీవ్ర ఆరోపణలు చేసింది. కొన్నాళ్లుగా బన్నీ వాస్ తనను పలు రకాలుగా వేధిస్తున్నాడని, వాటికి బన్నీ వాస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోందీమె. తన నిరసనను ఫిలిం ఛాంబర్ ముందు వ్యక్తం చేస్తోంది. ఇక్కడ కూడా శ్రీరెడ్డినే ఫాలో అవుతోంది.

గతంలో ఫిలింఛాంబర్ ముందు శ్రీరెడ్డి అర్థనగ్నంగా నిలబడి నిరసన తెలిపింది. ఇప్పుడు సునీత బోయ తననుతాను ఏకంగా ఫిలింఛాంబర్ గేట్ కు కట్టేసుకుంది. తనను ఎవ్వరూ కదిలించకుండా ఉండేందుకు తన ఒక చేతిని, కాలిని ఫిలింఛాంబర్ గేటుకు గొలుసులతో కట్టేసుకొని తాళం వేసి, ఆ తాళం కనిపించకుండా చేసింది. బన్నీ వాస్ తనకు వివరణ ఇవ్వాలి, అల్లు అరవింద్ కూడా జోక్యం చేసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది.

కానీ సునీత బోయను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఛాంబర్ పెద్దల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. సునీత బోయ కట్టుకున్న గొలుసుల్ని పగలగొట్టారు. నేరుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. గతంలో శ్రీరెడ్డి, మహేష్ కత్తి, బిగ్ బాస్ విజేత కౌశల్ పై పలు ఆరోపణలు చేసింది సునీత బోయ.

Posted by Sunitha Boya on Wednesday, 4 September 2019

Tags:    
Advertisement

Similar News