కల్యాణి అందుకే రాలేదట

ఈ రోజు ఉదయం చిత్రలహరి టీజర్ లాంఛ్ గ్రాండ్ గా జరిగింది. హీరో సాయిధరమ్ తేజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. హీరోయిన్ నివేత పెతురాజ్ కూడా వచ్చింది. కానీ మెయిన్ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ మాత్రం రాలేదు. ఆమె కనిపించకపోయే సరికి మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఆమెకు టాలీవుడ్ అంటే లెక్కలేదని కొందరు, యూనిట్ కు కల్యాణికి విభేదాలు వచ్చాయని మరికొందరు పుకార్లు పుట్టించారు. కానీ కల్యాణి గైర్హాజరీ వెనక కారణం వేరే ఉంది. కోలీవుడ్ […]

Advertisement
Update:2019-03-13 12:10 IST
కల్యాణి అందుకే రాలేదట
  • whatsapp icon

ఈ రోజు ఉదయం చిత్రలహరి టీజర్ లాంఛ్ గ్రాండ్ గా జరిగింది. హీరో సాయిధరమ్ తేజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. హీరోయిన్ నివేత పెతురాజ్ కూడా వచ్చింది. కానీ మెయిన్ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ మాత్రం రాలేదు. ఆమె కనిపించకపోయే సరికి మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఆమెకు టాలీవుడ్ అంటే లెక్కలేదని కొందరు, యూనిట్ కు కల్యాణికి విభేదాలు వచ్చాయని మరికొందరు పుకార్లు పుట్టించారు. కానీ కల్యాణి గైర్హాజరీ వెనక కారణం వేరే ఉంది.

కోలీవుడ్ లో శివ కార్తికేయన్ హీరోగా ఈరోజు ఓ సినిమా ప్రారంభమైంది. దానికి హీరో అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి అంగీకరించింది కల్యాణి. ఆమెకిదే తొలి తమిళ సినిమా. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లో లాంఛింగ్ కు హాజరుకావాల్సిందే. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో చిత్రలహరి టీజర్ లాంఛ్ ఈవెంట్ కు ఆమె గైర్హాజరైంది.

ఇది తెలియని కొందరు జనాలు కల్యాణి ప్రియదర్శన్ పై లేనిపోని పుకార్లు సృష్టించారు. త్వరలోనే ఆమె హైదరాబాద్ వస్తుంది. ఆమెతోనే సినిమా ప్రచారం ప్రారంభించాలని యూనిట్ భావిస్తోంది. అప్పుడైనా పుకార్లకు చెక్ పడుతుందేమో చూడాలి.

Tags:    
Advertisement

Similar News