మరోసారి హిట్ పై కన్నేసిన సూర్య

సింగం ప్రాజెక్టుపై భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నాడు సూర్య. మొదటి భాగం యముడు హిట్ అవ్వడం, రెండో భాగం సింగం-2 కూడా హిట్ అవ్వడంతో… ఈసారి సింగం-3తో మరో హిట్ అందుకోవాలని ఆశపడుతున్నాడు. నిజానికి సౌత్ లో ఏ సినిమా సీక్వెల్ హిట్ అయిన దాఖలాలు లేవు. అలాంటిది సింగం సినిమా ఆ నెగెటివ్ సెంటిమెంట్ ను తుడిచిపెట్టేసింది. అందుకే సూర్య ఇప్పుడు సింగం సీక్వెల్ పై మరింత నమ్మకంతో ఉన్నాడు. టోటల్ కాల్షీట్లన్నీ ఈ సినిమాకే […]

Advertisement
Update:2016-08-24 03:15 IST
మరోసారి హిట్ పై కన్నేసిన సూర్య
  • whatsapp icon

సింగం ప్రాజెక్టుపై భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నాడు సూర్య. మొదటి భాగం యముడు హిట్ అవ్వడం, రెండో భాగం సింగం-2 కూడా హిట్ అవ్వడంతో… ఈసారి సింగం-3తో మరో హిట్ అందుకోవాలని ఆశపడుతున్నాడు. నిజానికి సౌత్ లో ఏ సినిమా సీక్వెల్ హిట్ అయిన దాఖలాలు లేవు. అలాంటిది సింగం సినిమా ఆ నెగెటివ్ సెంటిమెంట్ ను తుడిచిపెట్టేసింది. అందుకే సూర్య ఇప్పుడు సింగం సీక్వెల్ పై మరింత నమ్మకంతో ఉన్నాడు. టోటల్ కాల్షీట్లన్నీ ఈ సినిమాకే కేటాయించాడు. దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ఈనెల 26 నుంచి మలేషియాలో మొదలుకానుంది. ఈ మేరకు యూనిట్ సభ్యులంతా ప్రిపేర్ అయిపోయారు. సింగం-3కు సంబంధించి చెన్నై, విశాఖలో భారీ షెడ్యూల్స్ జరిగాయి. సినిమాకు సంబంధించిన కీలకమైన సన్నివేశాలన్నీ అక్కడే తీశారు. ఇప్పుడు మలేషియాలో మరో కీలక షెడ్యూల్ ను ప్రారంభించబోతున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమాకు సంబంధించిన కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిపోతుంది. స్టూడియో గ్రీన్ సంస్థతో కలిసి సూర్య సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో అనుష్క, శృతి హాసన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సింగం సిరీస్‌లో గత రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన హరి, మూడో సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నాడు.

Also Read

జనతా గ్యారేజ్ విడుదల తేదీ మళ్లీ మారింది…
జనతా గ్యారేజ్ విడుదల తేదీ మళ్లీ మారింది…
మాయచేస్తున్న ప్రేమమ్ సాంగ్
పుట్టినరోజు నాడు చిరంజీవి చేసిన పని ఇదే…
ర‌క్త చ‌రిత్ర 2 పార్ట్స్… న‌యిమ్ చ‌రిత్ర 3 భాగాలు అంటున్న వ‌ర్మ‌
Tags:    
Advertisement

Similar News