బెజవాడ టీడీపీ కార్పొరేటర్లు చాలా స్పీడండి! విమానంలోనే డాష్.. డాష్..
టీడీపీ కార్పొరేటర్లు విజయవాడ పరువును పక్కరాష్ట్రాల్లో గంగపాలు చేస్తున్నారు. పదిరోజుల క్రితం పుణే రైల్వేస్టేషన్‌లో ఒక మహిళను లైంగికంగా వేధిస్తూ నలుగురు టీడీపీ కార్పొరేటర్లలు అక్కడి పోలీసులకు పట్టుబడిన ఘటన మరువకముందే మరో టీడీపీ కార్పొరేటర్ అదే పనిచేశారు. ఈయన ఏకంగా విమానంలోనే కళాపోషణ చూపెట్టేందుకు ప్రయత్నించాడు. బెజవాడకు చెందిన కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో మహిళను వేధించాడు. అసభ్యకరంగా ప్రవర్తించాడు. విమానంలోనే అందరి ముందు చంటిబాబును సదరు మహిళ […]
;టీడీపీ కార్పొరేటర్లు విజయవాడ పరువును పక్కరాష్ట్రాల్లో గంగపాలు చేస్తున్నారు. పదిరోజుల క్రితం పుణే రైల్వేస్టేషన్‌లో ఒక మహిళను లైంగికంగా వేధిస్తూ నలుగురు టీడీపీ కార్పొరేటర్లలు అక్కడి పోలీసులకు పట్టుబడిన ఘటన మరువకముందే మరో టీడీపీ కార్పొరేటర్ అదే పనిచేశారు. ఈయన ఏకంగా విమానంలోనే కళాపోషణ చూపెట్టేందుకు ప్రయత్నించాడు. బెజవాడకు చెందిన కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో మహిళను వేధించాడు. అసభ్యకరంగా ప్రవర్తించాడు. విమానంలోనే అందరి ముందు చంటిబాబును సదరు మహిళ ధైర్యంగా ఎదురించింది. విమానసిబ్బందికి ఫిర్యాదు చేసినా వారు ఏమీ చేయలేకపోయారు. దీంతో మహిళ శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చంటిబాబుపై సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. చంటిబాబును అరెస్ట్ చేయాల్సిందిగా గన్నవరం పోలీసులకు శంషాబాద్ పోలీసులు సమాచారం అందచేశారు. దీంతో చంటిబాబును అదుపులోకి తీసుకున్నారు. ఇంతలోనే టీడీపీ ఎంపీ ఒకరు రంగంలోకి దిగారు. వెంటనే చంటిబాబును విడుదల చేయాలని లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. దీంతో ఎప్పటిలాగే అధికారపార్టీ నేతపై చర్యలకు పోలీసులు వెనుకడుగు వేశారు. శంషాబాద్ పోలీసులకు మాత్రం తాము చర్యలు తీసుకుంటామని గన్నవరంపోలీసులు చెప్పి సరిపెట్టారు. బాధితురాలు మాత్రం నిందితుడిపై చర్యలుతీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
Click on Image to Read: