పాతిక కోట్లు పోసి కొనుకున్నార‌ట‌..!

శ్రీమంతుడు చిత్రం సక్సెస్ తర్వాత మహేష్ బాబు రేంజే మారిపోయింది. ఆయన ఉత్సాహంలో దర్శకుడు కొరటాల శివకు బిఎమ్ డబ్లూ కారు ఇచ్చారు. అలాగే తనకు రేంజి రోవర్ కారు కొనుక్కున్నారు. ఇప్పుడు ఆయన ఓ పోష్ లొకాలిటీలో ప్లాట్ కొన్నట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం ఆ ప్లాట్ కొన్నది ముంబై సబర్బన్ ఏరియాలో. ఆ ప్లాట్ ఖరీదు 25 కోట్లు అని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ అతని స్నేహితులు వేసిన వెంచర్ లోదే ఈ […]

Advertisement
Update:2015-11-27 00:32 IST

శ్రీమంతుడు చిత్రం సక్సెస్ తర్వాత మహేష్ బాబు రేంజే మారిపోయింది. ఆయన ఉత్సాహంలో దర్శకుడు కొరటాల శివకు బిఎమ్ డబ్లూ కారు ఇచ్చారు. అలాగే తనకు రేంజి రోవర్ కారు కొనుక్కున్నారు. ఇప్పుడు ఆయన ఓ పోష్ లొకాలిటీలో ప్లాట్ కొన్నట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం ఆ ప్లాట్ కొన్నది ముంబై సబర్బన్ ఏరియాలో. ఆ ప్లాట్ ఖరీదు 25 కోట్లు అని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ అతని స్నేహితులు వేసిన వెంచర్ లోదే ఈ ప్లాట్. మహేష్, నమ్రత రీసెంట్ గా ముంబై వెళ్ళి ఈ ప్లాట్ కు సంభందించిన పేపర్ వర్క్ పూర్తి చేసుకువచ్చారట‌..

అలాగే ఈ 25 కోట్లును తను తర్వాత చేయబోయే చిత్రం కోసం ఇద్దరు ప్రొడ్యూసర్స్ వద్ద అడ్వాన్స్ గా తీసుకున్న మొత్తం అని తెలుస్తోంది. ముంబై వెళ్లినప్పుడు ఈ ప్లాట్ ని ఉపయోగిస్తారు. అలాగే తమ కుటుంబ సభ్యులు ఎవరైనా ముంబై వెళితే హోటల్ లో దిగకుండా ఈ ప్లాట్ లో దిగవచ్చు అని ప్లాన్ చేసి తీసుకున్నారని సమాచారం. మహేష్ తాజా చిత్రాల విషయానికి వస్తే… సూపర్ హిట్ ‘శ్రీమంతుడు’ చిత్రం తర్వాత మహేష్‌ బాబు చేస్తున్న సినిమా ‘బ్రహ్మోత్సవం’ . పి.వి.పి. సినిమా పతాకంపై ఈ చిత్రం రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. రీసెంట్ గా ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్ వివరాలను మీడియాకు తెలియచేసింది. రామోజీ ఫిల్మ్ సిటీ, ఊటీలలో ఈ చిత్రం కంటిన్యూ షెడ్యూలు షూటింగ్ జరపనున్నట్లు ప్రకటించింది.

Tags:    
Advertisement

Similar News