Telugu Global
WOMEN

ఇల్లు.. ఉద్యోగం బ్యాలెన్స్‌ చేసేద్దాం ఇలా

ఉద్యోగ బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తూనే వ్యక్తిగత జీవితంలోనూ రాణించాలి. అదే మహిళల ముందు ఉండే అతి పెద్ద టాస్క్.

ఇల్లు.. ఉద్యోగం బ్యాలెన్స్‌ చేసేద్దాం ఇలా
X

ఉద్యోగ బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తూనే వ్యక్తిగత జీవితంలోనూ రాణించాలి. అదే మహిళల ముందు ఉండే అతి పెద్ద టాస్క్ .. అయితే లైఫ్‌లో చిన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఉద్యోగాన్ని, ఇంటిని రెండింటినీ ఈజీగా బ్యాలెన్స్ చేయవచ్చంటున్నారు ఎక్స్‌పర్ట్స్.. అదెలాగో చూద్దాం

మనం చేసే పని మనకు ముందుగా నచ్చాలి.. అంటే మనం నచ్చిన పనే ఎన్నుకోవాలి.. అందులో రాజీ పడ్డామా ఉద్యోగం చేసినంత కాలం ఆ నచ్చని భారాన్ని మోస్తూనే ఉండాలి.. కాబట్టి ముందు మనం వేసే మొదటి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. సరే పని మొదలయ్యింది.. ఇది మన కాలేజ్ కాదు అందరినీ కలుపుకు వెళ్లిపోవడానికి, అలా అని ఇల్లు కూడా కాదు మనవాళ్లే కదా అని అడ్జస్ట్ అయిపోవడానికి. అలా అని ఇక్కడ మీరు మరీ పెద్ద వయసువారు కాదు చిన్న వారి తప్పుల్ని చూసి చూడనట్టు వదిలేయడానికి, అలా అని చిన్న వారు కూడా కాదు ఎదటివారి నుంచి బుజ్జగింపు ఆశించడానికి. ఇలా ఏ ఒక్క భావనలోనూ ఇరుక్కోకుండా మీ పని మీరు చేయటమే మీ ఉద్యోగం.


వర్క్‌ను, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం అంటే రెండింటికీ సరైన సమయాన్ని కేటాయించడం మాత్రమే కాదు.. రెండింటిలోనూ విజయం కూడా సాధించాలి. కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన సందర్భాల్లో మరో ఆలోచన లేకుండా నడుచుకోవాలి. ఆఫీస్‌లో మనం మాత్రమే చేయాల్సిన పని ఉన్నదని తెలిస్తే ఆఫ్ డే నాడు కూడా వర్క్ చేయాలి. అయితే దీనికంటే ముందు ఇంట్లో అయినా ఆఫీసులో అయినా మీరు ఎవరి పని వారు చేసేలా చూడాలి. ఆ తరువాతే మీ సహాయాన్ని అందించాలి.


వర్క్ లైఫ్‌ని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయాలంటే మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉండాలంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ఆఫీసులో పని ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ఒత్తిడి సహజం. కానీ తక్కువ పని ఉన్న సందర్భాల్లోనూ స్ట్రెస్ ఫీలవుతున్నారంటే మీరు మానసికంగా బలహీనంగా ఉన్నటే లెక్క. ఇందులోంచి బయట పడాలి అంటే యోగా, ధ్యానం వంటివి చేయడంతోపాటు వాకింగ్, జాగింగ్‌ వంటివి కూడా అలవాటు చేసుకోండి. ఆఫీస్ పని పూర్తవ్వగానే కుటుంబంతో కొంత సమయం గడపటానికి ప్రాధాన్యత ఇవ్వండి.. ఇవన్నీ చేస్తూనే మీకోసం మీరు కొంత సమయాన్ని వెచ్చించుకోవడం మాత్రం మరచిపోకండి.

First Published:  21 Nov 2023 6:00 PM IST
Next Story