Telugu Global
Travel

ఫ్యామిలీ ట్రిప్‌లో ఈ జాగ్రత్తలు మస్ట్!

ప్రస్తుతం పిల్లలకు దసరా సెలవులు నడుస్తున్నాయి. ఈ టైంలో చాలామంది ఫ్యామిలీతో కలిసి ట్రిప్‌కెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే పిల్లలు, వృద్ధులతో కలిసి ట్రిప్‌కు వెళ్లేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.

ఫ్యామిలీ ట్రిప్‌లో ఈ జాగ్రత్తలు మస్ట్!
X

ఫ్యామిలీ ట్రిప్‌లో ఈ జాగ్రత్తలు మస్ట్!

ప్రస్తుతం పిల్లలకు దసరా సెలవులు నడుస్తున్నాయి. ఈ టైంలో చాలామంది ఫ్యామిలీతో కలిసి ట్రిప్‌కెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే పిల్లలు, వృద్ధులతో కలిసి ట్రిప్‌కు వెళ్లేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అవేంటంటే..

ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు అందరి ఇష్టానికి తగ్గట్టుగా ప్లేస్‌ను ఎంచుకోవాలి. అలాగే వెళ్తున్న సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్లేస్‌ను సెలక్ట్ చేయాలి. ప్రస్తుతం వర్షాలు తగ్గి చలి మొదలైంది కాబట్టి హిల్ స్టేషన్స్ వంటివి బాగుంటాయి. ఈశాన్య రాష్ట్రాలు, వెస్ట్ కర్ణాటకలోని వెస్టర్న్ ఘాట్స్, వెస్ట్ మహారాష్ట్ర, కేరళ వంటి ప్రదేశాలు ఎంచుకోవచ్చు. వెళ్తున్న ప్రదేశాలను బట్టి ఎన్ని రోజుల ట్రిప్ అయితే బాగుంటుందో ప్లాన్ చేసుకోవాలి.

ఫ్యామిలీతో కలిసి ట్రిప్‌కి వెళ్లేటప్పుడు లగేజీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఉన్నారు కదా అని ఎక్కువ లగేజీ తీసుకెళ్తే.. ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి లగేజీ వీలైనంత లైట్‌గా ఉండేలా చూసుకోవాలి. ఎంత తక్కువ లగేజ్ ఉంటే ట్రిప్ అంత హాయిగా సాగుతుంది.

వాతావరణంలో మార్పులొస్తే పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరాలు లాంటివి మొదలవుతాయి. కాబట్టి సేఫ్టీ కోసం పిల్లలకు వాడే మందులు వెంట తీసుకువెళ్లాలి. అలాగే పిల్లలు ఆకలి అన్నప్పుడు ఇవ్వడానికి బ్యాగులో కొన్ని శ్నాక్స్‌ వెంట ఉంచుకుంటే మంచిది.

ఫ్యామిలీతో ట్రిప్‌కి వెళ్లేటప్పుడు ఫిక్స్‌డ్ బడ్జెట్ పెట్టుకుంటే కుదరకపోవచ్చు. ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్లినప్పుడు కొన్ని అనుకోని ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.

ట్రిప్‌లో మీ వస్తువులేవైనా పోగొట్టుకున్నా, ఏదైనా ప్రమాదం జరిగినా లేదా ఆరోగ్య సమస్యలు తలెత్తినా.. ఖర్చు అవ్వకూడదనుకుంటే ముందుగానే ఓ ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్. తరచూ వెకేషన్లకు వెళ్లేవాళ్లకు ఇన్సూరెన్స్ బాగా ఉపయోగపడుతుంది.

ఫ్యామిలీతో వెళ్లేటప్పుడు వెళ్లబోతున్న ప్రదేశం గురించి, ఆ రూట్ తెలుసుకోవడం మంచిది. పిల్లలు, వృద్ధులతో అనుకోని సమస్యలు ఎదురైనప్పుడు దగ్గర్లో అన్ని వసతులు ఉన్నాయో లేదో చూసుకోవడం ముఖ్యం.

వెళ్లినచోట ఇబ్బందులు లేకుండా ఉండాలంటే అన్నీ ముందుగానే బుక్ చేసుకోవాలి. హోటల్ స్టే, రిటర్న్ టికెట్స్ ముందే బుక్ చేసుకుంటే హడావిడి ఉండదు.

ఇకచివరిగా ఫ్యామిలీ ట్రిప్‌లో పిల్లలు, వృద్ధులు అందరి దగ్గర ఐడెంటిటీ కార్డు ఉండడం మంచిది. పిల్లలు తప్పిపోతే కాంటాక్ట్ చేసేందుకు మొబైల్ నెంబర్ వంటివి నోట్ చేసి పాకెట్స్‌లో పెట్టాలి.

First Published:  18 Oct 2023 11:45 AM IST
Next Story