Telugu Global
Travel

రాజస్తాన్ పుష్కర్ ఫెయిర్ చూసొద్దామా!

రాజస్తాన్‌లోని అజ్మీర్‌‌లో ప్రతిఏటా నవంబర్ 18 నుంచి నవంబర్ 27 వరకూ పుష్కర్ ఫెయిర్ జరుగుతుంది.

రాజస్తాన్ పుష్కర్ ఫెయిర్ చూసొద్దామా!
X

రాజస్తాన్ పుష్కర్ ఫెయిర్ చూసొద్దామా!

విభిన్నమైన సంస్కృతి సాంప్రదాయాలకు రాజస్తాన్ పెట్టింది పేరు. రాజస్తాన్ కల్చర్‌‌ను ఆస్వాదించాలంటే చేయాలంటే అక్కడ జరిగే ఫెస్టివల్స్, ఫెయిర్స్‌కు వెళ్లాలి. ముఖ్యంగా రాజస్తాన్‌లోని అజ్మీర్‌‌లో జరిగే పుష్కర్ ఫెయిర్.. రాజస్తాన్ కల్చర్‌‌ను కళ్లను కట్టినట్టు చూపిస్తుంది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

రాజస్తాన్‌లోని అజ్మీర్‌‌లో ప్రతిఏటా నవంబర్ 18 నుంచి నవంబర్ 27 వరకూ పుష్కర్ ఫెయిర్ జరుగుతుంది. కార్తీక మాసంలో జరిగే ఈ కల్చరల్ ఫెస్టివల్‌కు రాజస్తాన్ చుట్టుపక్కల నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు.

ఈ ఫెయిర్ లో రాజస్తాన్ హస్తకళల మార్కెట్ ఉంటుంది. సీతౌలియా, లాంగ్డి టాంగ్, గిల్లి-దండా, కబడ్డీ వంటి ఆటల పోటీలు నిర్వహిస్తారు. అలాగే రాజస్తాన్ జానపద నృత్యాలు, సంగీతం వంటివి కూడా ఇక్కడ ఆస్వాదించొచ్చు. వీటితోపాటు డిజర్ట్ ఫుట్‌బాల్, కైట్ ఫెస్టివల్, సాండ్ ఆర్ట్ ఫెస్టివల్ వంటివి కూడా ఇక్కడ ఎక్స్‌పీరియెన్స్ చేయొచ్చు. అజ్మీర్‌‌తో పాటు జైసల్మేర్, ఉదయపూర్, జోధ్‌పూర్, జైపూర్, బికానెర్ వంటి ప్రాంతాల్లో కూడా ఇదే పండుగ వాతావరణం ఉంటుంది.

ఫెయిర్ చివరి రోజుల్లో క్రికెట్ మ్యాచ్, మీసాల పోటీలు, తలపాగా పోటీలు ఉంటాయి. పొడవాటి మీసాలు, పెద్దపెద్ద తలపాగాలు ప‌ర్యాట‌కుల‌కు కొత్త అనుభూతినిస్తాయి. అలాగే గుర్రాల డ్యాన్స్, ఒంటెల అలంకరణ, రాజస్తాన్ ట్రెడిషనల్ డ్యాన్స్ వంటివి కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు.


అజ్మీర్ చేరుకునేందుకు హైదరాబాద్ నుంచి ట్రైన్స్ ఉన్నాయి. జైపూర్ వెళ్లే ట్రైన్ అజ్మీర్‌‌లో ఆగుతుంది. అలాగే ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ నుంచి కూడా అజ్మీర్ చేరుకోవచ్చు. అజ్మీర్ నుంచి పుష్కర్ విలేజ్‌కు 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. లోకల్ క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి.


First Published:  22 Nov 2023 9:45 AM GMT
Next Story