వీకెండ్ అడ్వెంచర్స్ @ హైదరాబాద్!
వీకెండ్‌లో మంచి అడ్వెంచర్ యాక్టివిటిస్ చేయాలనుకుంటున్నారా? దీనికోసం ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. హైదరాబాద్ చుట్టుపక్కలే బోలెడు ఆప్షన్లు ఉన్నాయి.
వీకెండ్‌లో మంచి అడ్వెంచర్ యాక్టివిటిస్ చేయాలనుకుంటున్నారా? దీనికోసం ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. హైదరాబాద్ చుట్టుపక్కలే బోలెడు ఆప్షన్లు ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దామా!
అడ్వెంచర్ యాక్టివిటీస్‌ను చాలామంది ఇష్టపడుతుంటారు. పారాగ్లైడింగ్, రాక్ క్లైంబింగ్, బంగీ జంపింగ్ వంటివి చేయడం కోసం ఎక్కడెక్కడికో వెళ్తుంటారు. అయితే అలాంటి ఎన్నో అడ్వెంచర్స్‌ను హైదరాబాద్‌లో కూడా ఎక్స్‌పీరియెన్స్ చేయొచ్చు. వాటికోసం ఎక్కడికి వెళ్లాలంటే..
పారాగ్లైడింగ్ @ కొండపోచమ్మ
ఎంతో ఎత్తులో ఆకాశంలో విహరించే అనుభూతిని పొందాలంటే ఒక్కసారైనా పారాగ్లైడింగ్ చేయాలి. దీనికొసం హైదరాబాద్‌కు 53 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపోచమ్మ సాగర్‌కు వెళ్లాలి. ఇక్కడ పారాగ్లైడింగ్ తరహాలోనే పారా మోటరింగ్ అడ్వెంచర్ అందుబాటులో ఉంది. ధరు సుమారు రూ. 3,500 ఉంటుంది.
బంగీ జంప్ @ శామీర్ పేట్
ఎత్తయిన ప్రదేశం నుంచి తాళ్లు కట్టుకుని కిందికి దూకే సాహసం చాలా థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది. ఇలాంటి అడ్వెంచర్స్‌ను ఆఫర్ చేస్తున్న సంస్థలు కొన్ని మన హైదరాబాద్ లో ఉన్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీ, శామీర్‌పేట్‌లోని లియోనియా రిసార్ట్, డిస్ట్రిక్ గ్రావిటి పార్క్ వంటి ప్రాంతాల్లో బంగీజంప్ చేయొచ్చు. ధర సుమారు రూ.3500 నుంచి 4500 వరకూ ఉంటుంది. ఈ ప్రాంతాల్లో జిప్‌లైన్ వంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి.
స్కై డైవింగ్ @ గండిపేట్
ఎత్తైన కొండ లేదా విమానం నుంచి కిందకు దూకే అడ్వెంచర్‌ను స్కై డైవింగ్ అంటారు. అయితే ఇండోర్‌లో అచ్చం అలాంటి ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చే అడ్వెంచర్ యాక్టివిటీ హైదరాబాద్‌లో ఉంది. గండిపేటలోని గ్రావిటీ జిప్ అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో ఇండోర్ స్కై డైవింగ్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ధర సుమారు రూ. 3,500 నుంచి 4500 వరకు ఉంటుంది.
ట్రెకింగ్ @ అనంతగిరి
హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి హిల్స్‌లో ట్రెకింగ్ చేయొచ్చు. ఇక్కడి కొండల్లో చేసే ట్రెకింగ్ చాలా ఈజీగా ఉంటుంది. కొండపై క్యాపింగ్ కూడా చేసుకోవచ్చు. వీటితోపాటు రాక్ క్లైంబింగ్, గోకార్టింగ్, క్లౌడ్ డైనింగ్, షిప్పింగ్ వంటి పలు యాక్టివిటీస్‌ను కూడా హైదరాబాద్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేయొచ్చు.