Telugu Global
Travel

అండర్ వాటర్ సెల్ఫీ స్పాట్ గురించి తెలుసా?

సెల్ఫీలకుండే క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇండోనేసియాలోని సెంట్రల్ జావాలో అండర్ వాటర్ సెల్పీ స్పాట్ రెడీ చేశారు అక్కడి వాళ్లు.

Umbul Ponggok: అండర్ వాటర్ సెల్ఫీ స్పాట్ గురించి తెలుసా?
X

Umbul Ponggok: అండర్ వాటర్ సెల్ఫీ స్పాట్ గురించి తెలుసా?

ఈ రోజుల్లో సెల్ఫీలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. సెల్ఫీ కోసం ఎలాంటి సాహసానికైనా రెడీ అవుతుంటారు కొంతమంది. సెల్ఫీలకుండే క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇండోనేసియాలోని సెంట్రల్ జావాలో అండర్ వాటర్ సెల్పీ స్పాట్ రెడీ చేశారు అక్కడి వాళ్లు. దీని ప్రత్యేకతలేంటంటే..

ఇండోనేసియాలోని సెంట్రల్ జావా ప్రాంతంలో ఉండే ‘ఉంబుల్‌ పొంగాక్‌’ అనే లేక్.. అండర్ వాటర్ సెల్ఫీలకు ఫేమస్ స్పాట్‌గా మారింది. ఈ లేక్ ఒకప్పుడు మురికిగా ఉండేది. ఆ ప్రాంతంలో టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉండడాన్ని గమనించిన అక్కడి గ్రామస్తులు లేక్‌ను క్లీన్ చేసి దాని అడుగున సెల్ఫీ స్పాట్ రెడీ చేశారు.

లేక్ అడుగున ఫొటోల కోసమని స్కూటర్, సైకిల్ లాంటి కొన్ని అందమైన వస్తువులు ఉంచారు. లేక్ పేరు మీద ఒక ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ క్రియేట్ చేసి అండర్ వాటర్‌‌లో దిగిన ఫోటోలను అప్‌లోడ్ చేశారు.


దాంతో కొద్దిరోజుల్లోనే ఆ పేజీకి ఫాలోవర్లు పెరిగారు. ఆ స్పాట్ తెగ పాపులర్ అయింది. టికెట్ ధర చెల్లిస్తే.. డైవింగ్‌ మాస్క్‌, బ్రీతింగ్‌ ట్యూబ్‌ లాంటివి ఇస్తారు. అవి పెట్టుకుని డైవింగ్ చేస్తే సెల్ఫీ స్పాట్‌కు చేరుకోవచ్చు.




First Published:  29 March 2023 6:26 AM IST
Next Story