గ్రూప్‌గా ట్రావెల్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు!
ఇయర్ ఎండింగ్ సందర్భంగా ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు చాలామంది. అయితే నలుగురు లేదా అంతకంటే ఎక్కువమంది గుంపుగా ట్రావెల్ చేస్తున్నప్పుడు సమస్యలు రాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం అంటున్నారు నిపుణులు.
ఇయర్ ఎండింగ్ సందర్భంగా ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు చాలామంది. అయితే నలుగురు లేదా అంతకంటే ఎక్కువమంది గుంపుగా ట్రావెల్ చేస్తున్నప్పుడు సమస్యలు రాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం అంటున్నారు నిపుణులు.
ఎక్కువమందితో కలిసి చేసే ప్రయాణాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఫ్రెండ్స్‌తో కలిసి మెమరీస్‌ను షేర్ చేసుకుంటే ఆ అనుభూతే వేరు. అయితే ఎక్కువమంది కలిసి ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణం సాఫీగా సాగాలంటే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అవేంటంటే..
గుంపుగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు అందరూ ఒకమాట మీద ఉండడం అవసరం. వెళ్లబోతున్న ప్రదేశం అక్కడ చేయాల్సిన యాక్టివిటీస్.. ఇలా ట్రిప్ ప్లానింగ్ అంతా అందరూ ముందుగా తెలుసుకోవాలి. ప్లానింగ్‌లో ఎవరికైనా ఇబ్బందులుంటే ముందే చర్చించుకుని బయలుదేరితే సమస్య ఉండదు.
గ్రూప్‌గా ట్రావెల్ చేస్తున్నప్పుడు కోఆర్డినేటర్‌గా ఒకరిని ఎంచుకుంటే ప్రతిసారి డిస్కషన్స్ పెట్టే అవసరం ఉండదు. టికెట్స్, రూమ్ బుకింగ్స్ ఇతర డాక్యుమెంట్స్ వంటివాటిని ఒకరికి అప్పజెప్తే ఇబ్బంది ఉండదు.
ట్రిప్‌లో కామన్‌గా ఉండే ఖర్చుల కోసం ఒక కామన్ వాలెట్ ఏర్పాటు చేసుకుని దాని బాధ్యత ఒకరికి అప్పజెప్తే.. ప్రతిసారి వాటాలు వేసుకునే అవసరం ఉండదు.
గ్రూప్ ట్రావెలింగ్ చేసేటప్పుడు సైట్ సీయింగ్స్ కోసం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కు బదులు వెహికల్ బుక్ చేసుకుంటే మరింత ఎక్కువగా ట్రిప్‌ను ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కువమంది ఉన్నప్పుడు హోటల్స్‌తో పాటుగా క్యాంపింగ్ వంటివి కూడా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది..
ఎక్కువమంది కలిసి ట్రావెల్ చేసేటప్పుడు ప్రతీ ఒక్కరికీ సరైన కమ్యూనికేషన్ ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం అందరూ అసెంబుల్ అయ్యి ప్లాన్స్‌ను సమన్వయం చేసుకుంటే బాగుంటుంది.
హోటల్ స్టే, ఫుడ్ వంటి ఆప్షన్స్‌ను అందర్ని దృష్టిలో ఉంచుకుని ఎంచుకోవాలి. అలాగే యాక్టివిటీస్ విషయంలో గ్రూప్ యాక్టివిటీస్‌ను ఎంచుకుంటే మరింత సరదాగా ఎంజాయ్ చేయొచ్చు.
ఫ్లైట్స్, రూమ్స్, ప్యాకేజెస్ వంటివి బుక్ చేసేటప్పుడు గ్రూప్ డిస్కౌంట్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించుకోవడం ద్వారా కొంత ఆదా చేసుకోవచ్చు.
ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఎక్కువమంది కలిసి ట్రావెల్ చేస్తున్నప్పుడు గ్రూప్‌లో అందరూ ఉన్నారా? ఎవరైనా మిస్ అయ్యారా? అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం ముఖ్యం. అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం కూడా ముఖ్యమే.