ట్రెకింగ్‌కు కేరాఫ్ కర్నాటక!
ఏదో టూరిస్ట్ ప్లేస్‌కు వెళ్లామా.. వచ్చామా.. అన్నట్టు కాకుండా ఆయా ప్రాంతాల్ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఇష్టపడుతున్నారు ఇప్పటి యూత్ అంతా. ట్రెకింగ్, హైకింగ్ లాంటి అడ్వెంచర్స్ చేస్తూ.. కొండలు ఎక్కేస్తున్నారు.
ఏదో టూరిస్ట్ ప్లేస్‌కు వెళ్లామా.. వచ్చామా.. అన్నట్టు కాకుండా ఆయా ప్రాంతాల్ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఇష్టపడుతున్నారు ఇప్పటి యూత్ అంతా. ట్రెకింగ్, హైకింగ్ లాంటి అడ్వెంచర్స్ చేస్తూ.. కొండలు ఎక్కేస్తున్నారు. శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ప్రశాంతత కూడా సమకూరాలంటే ట్రెకింగ్ టూర్స్ బెస్ట్ ఆప్షన్.
ట్రెకింగ్ అనేది ట్రావెలింగ్‌లో రీసెంట్ ట్రెండ్. అడ్వెంచర్ లవర్స్ అందరూ ట్రెకింగ్‌ను తెగ ఇష్టపడుతుంటారు. అయితే ట్రెక్ చేయాలంటే దానికి అనువైన కొండలు, లోయలు ఉండాలి. దీనికై వెస్టర్న్ ఘాట్స్‌లో బోలెడు ఆప్షన్స్ ఉన్నాయి. మరి వాటిపై ఓ లుక్కేద్దామా
తడియండమోల్
పశ్చిమ కనుమల్లోని ఎత్తైన శిఖరాల్లో తడియాండమోల్ ఒకటి. ఇది కర్నాటకలోని కూర్గ్ జిల్లాలో ఉంది. ఈ పీక్.. సముద్ర మట్టానికి 1748 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ పీక్‌కు ట్రెక్ చేయడం ఈజీగానే ఉంటుంది. ట్రెకింగ్ రూట్ పొడవు 8 కిలోమీటర్లు.
బ్రహ్మగిరి పీక్
కూర్గ్ జిల్లాలో ఉన్న మరో ఎత్తైన శిఖరం బ్రహ్మగిరి పీక్. ఇది సముద్ర మట్టానికి 1600 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సుమారు 9 కిలోమీటర్లు ట్రెక్ చేసి హిల్ టాప్ చేరుకోవాలి. ఈ ట్రెకింగ్ రూట్ అడవుల గుండా వెళ్తుంది. వైల్డ్‌లైఫ్‌ను కూడా ఎక్స్‌పీరియెన్స్ చేయొచ్చు. ఈ ట్రెక్ కాస్త కఠినంగా ఉంటుంది.
పుష్పగిరి పీక్
పుష్పగిరి హిల్ టాప్‌ను కుమార పర్వతం అని కూడా అంటారు. కూర్గ్ జిల్లాలో ఉన్న ఈ పీక్ ఎత్తు 1712 మీటర్లు. పుష్పగిరి ట్రెక్ రూట్ చాలా అందంగా ఉంటుంది. కాస్త కఠినంగా ఉండే ఈ ట్రెక్ పొడవు సుమారు 12 కిలోమీటర్లు.
దూద్‌సాగర్ ఫాల్స్
ఎంతో దూరం ట్రెక్ చేసి చివరగా అందమైన వాటర్‌ఫాల్స్‌ను చేరుకుంటే ఆ అనుభూతే వేరు. అలాంటి ట్రెక్ కోసం సౌత్ గోవా జిల్లాలో ఉన్న కులెం గ్రామానికి వెళ్లాలి. అక్కడి నుంచి కర్నాటక, గోవా బోర్డర్‌లో ఉన్న దూద్ సాగర్ ఫాల్స్‌కు ట్రెక్ చేయొచ్చు. కఠినతరంగా ఉండే ఈ ట్రెక్‌లో రాక్ క్లైంబింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. ట్రెక్ రూట్ 14 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.
కొడచాద్రి
కర్నాటకలోని షిమోగా జిల్లాలో ఉన్న కొడచాద్రి హిల్ టాప్.. సముద్రమట్టానికి 1343 మీటర్ల ఎత్తులో ఉంటుంది. జలపాతాలతో కూడిన ఈ ట్రెక్ రూట్ చాలా అందంగా ఉంటూ చేసేందుకు ఈజీగా ఉంటుంది. ట్రెక్ రూట్ పొడవు సుమారు 12 కిలోమీటర్లు ఉంటుంది.