ప్రపంచంలోనే నిశ్శబ్దమైన చోటు ఇదే!
ఎలాంటి బయటి శబ్దాలు వినిపించని పూర్తి నిశ్శబ్దమైన ప్రాంతం ఒకటుంది. ‘ఆహా! అక్కడ హాయిగా రిలాక్స్ అవ్వొచ్చు’ అనుకుంటున్నారేమో. కానీ, అత్యంత నిశ్శబ్దమైన ప్రాంతంలో మనుషులు ఎక్కువ సేపు ఉండలేరట.
![The Quietest Place on Earth: Orfield Laboratories The Quietest Place on Earth: Orfield Laboratories](https://www.teluguglobal.com/h-upload/2023/03/24/728075-quietest-place.webp)
Quietest Place on Earth: ప్రపంచంలోనే నిశ్శబ్దమైన చోటు ఇదే!
ఈ ప్రపంచంలో సౌండ్ పొల్యూషన్ ఎంతగా పెరిగిపోయిందో చెప్పనవసరం లేదు. ప్రశాంతత కోసం మారుమూల ప్రాంతాలకెళ్లినా అక్కడా ఏదో ఒక సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఎలాంటి బయటి శబ్దాలు వినిపించని పూర్తి నిశ్శబ్దమైన ప్రాంతం ఒకటుంది. ‘ఆహా! అక్కడ హాయిగా రిలాక్స్ అవ్వొచ్చు’ అనుకుంటున్నారేమో. కానీ, అత్యంత నిశ్శబ్దమైన ప్రాంతంలో మనుషులు ఎక్కువ సేపు ఉండలేరట. అదేంటి అనుకుంటున్నారా! ఇది చదివేయండి మరి.
యూఎస్‌లోని మిన్నెపోలిస్‌లో ఏర్పాటు చేసిన ఒర్ఫిల్డ్ లేబొరేటరీస్.. ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్దమైన చోటు. ఈ ల్యాబ్ గోడలు బయటి శబ్దాలను లోపలకు రానివ్వవు. అక్కడ ఎంత నిశ్శబ్దంగా ఉంటుందంటే.. బయటి శబ్దాలు ఆగిపోయి, లోపల అవయవాలు చేసే శబ్దాలు వినిపిస్తాయి.
గుండె చప్పుడు, ఊపిరితిత్తులు చేసే శబ్దాలు కూడా స్పష్టంగా వినిపిస్తాయి. అందుకే ఈ ల్యాబ్‌లోకి వెళ్లిన వాళ్లు 45 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండలేరట. అంతకంటే ఎక్కువసేపు ఉంటే పిచ్చి పట్టినట్టు అనిపిస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు.
స్పేస్‌లోకి వెళ్లబోయే ఆస్ట్రోనాట్‌లు నిశ్శబ్దంలో ఉండడాన్ని ప్రాక్టీస్ చేయడం కోసం ఈ ల్యాబ్‌ను ఉపయోగించుకుంటారు. అలాగే ఆడియో గాడ్జెట్లను టెస్ట్ చేయడానికి కూడా ఈ ల్యాబ్‌ను ఉపయోగిస్తారు. టూరిస్టులు కూడా ఈ ల్యాబ్‌ను విజిట్ చేయొచ్చు.