2024 లో లాంగ్ వీకెండ్స్ లిస్ట్ ఇదే!
2024లో ఏయే నెలల్లో ఎన్ని రోజుల లాంగ్ వీకెండ్స్ ఉన్నాయంటే..
మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. కొత్త ఏడాదిలో చాలామంది కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ట్రావెలింగ్‌ను ఇష్టపడేవాళ్లంతా వచ్చే ఏడాది ఫలానా ట్రిప్స్‌కు వెళ్లాలి అని ముందుగానే ఒక గోల్ పెట్టుకుంటారు. దానికి తగ్గట్టుగా సెలవులను కూడా ప్లాన్ చేసుకోవాలి కదా మరి! అందుకే వచ్చే ఏడాది అందుబాటులో ఉన్న లాంగ్ వీకెండ్స్ లిస్ట్‌ను ఓ సారి చూద్దాం.
2024లో చాలనే లాంగ్ వీకెండ్స్ అందుబాటులో ఉన్నాయి. వీకెండ్ సెలవుల్లో ట్రిప్స్ ప్లాన్ చేసేవాళ్లకు ఇవి అనుకూలంగా ఉంటాయి. 2024లో ఏయే నెలల్లో ఎన్ని రోజుల లాంగ్ వీకెండ్స్ ఉన్నాయంటే..
2024 న్యూఇయర్ డే సోమవారం వచ్చింది. డిసెంబర్ 30,31 తేదీలు శని, ఆదివారాలు. జనవరి 2(మంగళవారం)న ఒక లీవ్ తీసుకుంటే నాలుగు రోజుల వీకెండ్‌ను ఎంజాయ్ చేయొచ్చు.
జనవరిలో సంక్రాంతి పండుగ జనవరి 15 సోమవారం వచ్చింది. జనవరి 16 మంగళవారం రోజున సెలవు తీసుకుంటే శనివారం నుంచి మంగళవారం వరకూ నాలుగు రోజుల వీకెండ్‌ను ప్లాన్ చేసుకోవచ్చు.
జనవరి26 రిపబ్లిక్ డే శుక్రవారం రోజున వచ్చింది. కాబట్టి గురువారం లేదా మంగళవారం రోజున సెలవు తీసుకుంటే నాలుగు రోజుల వీకెండ్ ప్లాన్ ఎంజాయ్ చేయొచ్చు.
2024 ఫిబ్రవరి నెలలో ఎలాంటి లాంగ్ వీకెండ్స్ లేవు. మార్చి నెలలో 8వ తారీఖు మహాశివరాత్రి పండుగ శుక్రవారం(మార్చి 8)న వచ్చింది. ఒకరోజు ముందు లేదా తర్వాత లీవ్ పెట్టుకుంటే నాలుగు రోజుల వీకెండ్ దొరుకుతుంది. మార్చి నెలలో హోలీ పండుగ మార్చి 25 సోమవారం రోజున వచ్చింది. గురువారం లేదా మంగళవారం సెలవు తీసుకుంటే నాలుగు రోజుల వీకెండ్‌ను ప్లాన్ చేసుకోవచ్చు. మార్చి 29 శుక్రవారం రోజున గుడ్ ఫ్రైడే ఉంది. అంటే మూడు లేదా నాలుగు రోజుల వీకెండ్ దొరికినట్టే.
ఏప్రిల్, మే నెలల్లో లాంగ్ వీకెండ్ ఆప్షన్స్ లేవు. జూన్ నెలలో 17వ తేదీ సోమవారం బక్రీద్ పండుగ ఉంది. మంగళ వారం లేదా గురువారం లీవ్ తీసుకుంటే నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు.
జులై నెలలో లాంగ్ వీకెండ్ ఆప్షన్స్ లేవు. ఆగస్ట్ నెలలో ఇండిపెండెన్స్ డే గురువారం రోజున వచ్చింది. ఆగస్టు 16 శుక్రవారం లీవ్ తీసుకుంటే నాలుగు రోజుల వీకెండ్‌ను ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఆగస్టు 26 సోమవారం రోజున కృష్ణాష్టమి ఉంది. ఒకరోజు సెలవు తీసుకుంటే మరొక లాంగ్ వీకెండ్ రెడీ.
సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్5 ( గురువారం-)న ఓనమ్ పండుగ ఉంది. శుక్రవారం లీవ్ తీసుకుంటే నాలుగు రోజుల వీకెండ్ దొరుకుతుంది. అలాగే సెప్టెంబర్ 16 సోమవారం రోజుల మిలాద్–ఉన్–నబీ పండుగ ఉంది. ఇక్కడొక లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చు.
అక్టోబర్‌లో 11 వ తారీఖు శుక్రవారం మహార్నవమి పండుగ ఉంది. శనివారం దసరా పండుగ వచ్చింది. పెట్టుకున్న సెలవులను బట్టి నాలుగైదు రోజుల లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చు.
నవంబర్ 1న శుక్రవారం దీపావళి పండుగ వచ్చింది. ఒకరోజు సెలవు పెట్టుకుంటే నాలుగు రోజుల వీకెండ్ దొరుకుతుంది. 2024 డిసెంబర్ 25 క్రిస్టమస్.. బుధవారం రోజున వచ్చింది. సోమ, మంగళ వారాలు లీవ్ పెట్టుకుంటే ఐదు రోజుల లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు.