బుద్ధవనం ప్రత్యేకతలను ప్రశంసించిన రాయల్ భూటాన్ ప్రధాన బౌద్ధాచార్యుడు
ఇన్ని ప్రత్యేకతలు ఉన్న బుద్ధవనాన్ని త్వరలో తాను సందర్శిస్తానని ఆయన చెప్పారు. ఆ సందర్భంగా శివనాగిరెడ్డికి బౌద్ధాచార్యులు పట్టు శేషవస్త్రాన్ని బహుకరించారు.
రాయల్ భూటాన్ మొనాస్టరీ ప్రధాన బౌద్ధాచార్యులు ఖెన్ పొ ఉగేన్ నాంగెల్, బుద్ధవనం బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్ ప్రత్యేకతలను ప్రశంసించినట్లు బుద్ధవనం కన్సల్టెంట్ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. భూటాన్ ప్రస్తుత రాజధాని ధింపూ నగరంలో క్రీ.శ. 1629లో నిర్మించిన మొదటి చారిత్రక బౌద్ధారామంలో సోమవారం బౌద్ధాచార్యుని కలిసి, తెలంగాణ బౌద్ధ వారసత్వ స్థలాలు, నాగార్జునసాగర్‌లో పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్మించిన బుద్ధవనంలోని వివిధ విభాగాల్లో తీర్చిదిద్దిన బౌద్ధ శిలాఫలకాలు, స్తూపాలు, మహా స్తూపం, బుద్ధుని మరియు ఎనిమిది మంది అర్హతుల పవిత్ర ధాతువులు, ఆచార్య నాగార్జునుని విగ్రహం, బౌద్ధ మ్యూజియం, అశోకుని ధర్మ చక్రం గురించి శివనాగిరెడ్డి వివరించారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న బుద్ధవనాన్ని త్వరలో తాను సందర్శిస్తానని ఆయన చెప్పారు. ఆ సందర్భంగా శివనాగిరెడ్డికి బౌద్ధాచార్యులు పట్టు శేషవస్త్రాన్ని బహుకరించారు. శివనాగిరెడ్డి ఆచార్యులకు బుద్ధవనం బ్రోచర్‌ను అందజేశారు