Telugu Global
Travel

ఒకే రోజులో పంచారామాల టూర్.. ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజీ!

కార్తీక మాసంలో ప్రత్యేక దర్శనాల కోసం ఏపీఎస్‌ఆర్టీసీ పంచారామాల టూర్ ప్యాకేజీని రూపొందించింది.

ఒకే రోజులో పంచారామాల టూర్.. ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజీ!
X

ఒకే రోజులో పంచారామాల టూర్.. ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజీ!

కార్తీకమాసాన్ని శివునికి అత్యంత ప్రీతికరమైన మాసంగా చెప్తారు. అందుకే ఈ నెలలో ప్రముఖ శైవక్షేత్రాలైన పంచారామాలను దర్శిస్తుంటారు చాలామంది. ఈ క్షేత్రాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. అయితే ఒకేరోజులో ఈ ఐదు ఆలయాలను కవర్ చేసేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఓ స్పెషల్ ప్యాకేజీని అందుబాటులో ఉంచింది.

కార్తీక మాసంలో ప్రత్యేక దర్శనాల కోసం ఏపీఎస్‌ఆర్టీసీ పంచారామాల టూర్ ప్యాకేజీని రూపొందించింది. ఈ టూర్ గుంటూరు బస్ స్టేషన్ నుంచి మొదలవుతుంది. ఈ స్పెషల్ టూర్ బస్సులు నవంబర్ 19, 26 , డిసెంబర్ 3, 10 తేదీల్లో అందుబాటులో ఉంటాయి. ఈ బస్సులకు ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉంది.

గుంటూరు బస్టాండ్‌ నుంచి రాత్రి 9:15 గంటలకు బస్సు బయలుదేరడంతో టూర్ మొదలవుతుంది. ప్రయాణీకులు మరుసటిరోజు ఉదయానికి పంచారామాల్లో మొదటిదైన సామర్లకోటకు చేరుకుంటారు. అక్కడ కుమార భీమేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత రెండో క్షేత్రమైన ద్రాక్షారామానికి బయలుదేరతారు. అక్కడ భీమేశ్వర ఆలయాన్ని దర్శించుకుని ఆ తర్వాత పాలకొల్లు బయలుదేరతారు.

అక్కడ మూడో క్షేత్రమైన క్షిర రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత అక్కడికి దగ్గర్లోని భీమవరానికి వెళ్తారు. అక్కడ నాలుగవ క్షేత్రమైన సోమేశ్వర ఆలయాన్ని దర్శించుకునేసరికి సాయంత్రం అవుతుంది. ఆ తర్వాత బస్సు అమరావతి మీదుగా రిటర్న్ అవుతుంది. మరుసటిరోజు అమరావతిలోని చివరి క్షేత్రమైన అమరలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకుని గుంటూరు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ఈ టూర్ ద్వారా పంచారామ క్షేత్రాలన్నింటినీ ఒకేరోజులో దర్శించుకోవచ్చు. ప్యాకేజీలో భాగంగా కేవలం బస్సు ప్రయాణం మాత్రమే ఉంటుంది. ఫుడ్, ఎంట్రీ టికెట్స్ వంటివి యాత్రికులే చూసుకోవాలి. పంచారామా టూర్ టికెట్ ధరలు అల్ట్రా డీలక్స్‌కు రూ.1130, సూపర్ లగ్జరీకి రూ.1180 గా ఉన్నాయి.

First Published:  18 Nov 2023 4:00 AM GMT
Next Story