ఐఆర్‌సీటీసీ కశ్మీర్ టూర్! ప్యాకేజీ వివరాలివే...
‘మిస్టికల్ కశ్మీర్ ఎక్స్ హైదరాబాద్’ పేరుతో ఐఆర్‌సీటీసీ వరుస సమ్మర్ ట్రిప్‌లను ప్లాన్ చేసింది. ఈ నెల 19 నుంచి జూన్ 30 వరకు మే 19, మే 26, జూన్ 9, జూన్ 16, జూన్ 23, జూన్ 30 తేదీల్లో ఈ టూర్ అందుబాటులో ఉంటుంది.
మండే వేసవిలో మంచు కురిసే కశ్మీర్‌కు టూర్ వేయాలని చాలామందికి ఉంటుంది. అలాంటి వాళ్లు ఐఆర్ సీటీసీ అందించే కశ్మీర్ టూర్ ప్యాకేజీపై ఓ లుక్కేయొచ్చు. ‘మిస్టికల్ కశ్మీర్’ పేరుతో తీసుకొస్తున్న ఈ టూర్ ప్యాకేజీ వివరాల్లోకి వెళ్తే..
‘మిస్టికల్ కశ్మీర్ ఎక్స్ హైదరాబాద్’ పేరుతో ఐఆర్‌సీటీసీ వరుస సమ్మర్ ట్రిప్‌లను ప్లాన్ చేసింది. ఈ నెల 19 నుంచి జూన్ 30 వరకు మే 19, మే 26, జూన్ 9, జూన్ 16, జూన్ 23, జూన్ 30 తేదీల్లో ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. ఈ ట్రిప్ హైదరాబాద్ నుంచి మొదలవుతుంది. టూర్ మొత్తం ఐదు రాత్రులు ఆరు పగళ్లు ఉంటుంది.
ఈ ట్రిప్‌లో భాగంగా కశ్మీర్‌లోని దాల్ లేక్, ఫ్లోటింగ్ గార్డెన్స్, సోన్‌మార్గ్, తాజ్వాస్ గ్లేసియర్, శ్రీనగర్, గుల్‌మార్గ్, గోండోలా, పహల్గామ్, మొఘల్ గార్డెన్స్, చెష్మషాహి, పరిమహల్, బొటానికల్ గార్డెన్, షాలిమార్ గార్డెన్స్, హజ్రత్‌బల్ లాంటివెన్నో సందర్శించొచ్చు. వీటితోపాటు కశ్మీర్ లోయల మీదుగా రోప్ వే ప్రయాణం, రివర్ రాఫ్టింగ్, కనువిందు చేసే ఫ్లవర్ వ్యాలీస్, కుంకుమపువ్వు పంటలు, అవంతిపూర్ శిథిలాలు.. ఇలా కశ్మీర్‌లో చూడాల్సినవి, చేయాల్సినవి చాలానే ఉన్నాయి.
ప్యాకేజీ వివరాలు
ఈ ట్రిప్ ప్యాకేజీలో భాగంగా ఆరు రోజులు అల్పాహారం, రాత్రి భోజనం ఉచితంగా ఉంటుంది. త్రీ స్టార్ హోటల్‌లో స్టే ఉంటుంది.
మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు, ప్లేసుల్లో ఎంట్రీ టికెట్లు, అడ్వెంచర్ యాక్టివిటీస్ వంటి వాటికి ఖర్చులు టూరిస్టులే చూసుకోవాలి.
ఈ ప్యాకేజీ సింగిల్ షేరింగ్ ధర రూ.42,895, ట్విన్ షేరింగ్ అయితే రూ.38,200, అదే ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.36,845గా ఉంది.