Telugu Global
Travel

ఫుడ్ అంటే ఇష్టమా.. అయితే ఈ టూర్స్ వేయాల్సిందే!

హనీమూన్ ట్రిప్స్, అడ్వెంచర్ ట్రిప్స్ తరహాలో ఇప్పుడు ఫుడ్ ట్రిప్స్ కూడా పాపులర్ అవుతున్నాయి.

ఫుడ్ అంటే ఇష్టమా.. అయితే ఈ టూర్స్ వేయాల్సిందే!
X

హనీమూన్ ట్రిప్స్, అడ్వెంచర్ ట్రిప్స్ తరహాలో ఇప్పుడు ఫుడ్ ట్రిప్స్ కూడా పాపులర్ అవుతున్నాయి. అంటే అచ్చంగా విభిన్న రుచులను ఎక్స్‌పీరియెన్స్ చేసేందుకు చేసే ట్రిప్స్ అన్నమాట. మీరు ఫుడ్‌ను ఎక్కువగా ఇష్టపడేవాళ్లయితే.. ఇండియాలో తప్పక వెళ్లాల్సిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి.

భిన్న సాంప్రదాయాలకు ఇండియా పెట్టింది పేరు. కాబట్టి ఇక్కడ రుచులకు కొదవ లేదు. మనదేశంలో ఒక్కో ప్రాంతం ఒక్కో ఫుడ్‌కు ప్రసిద్ధి. ఓపిక ఉండాలేగానీ వందలకొద్దీ కొత్త రుచులను ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. మనదేశంలో తప్పక వెళ్లాల్సిన ఫుడ్ డెస్టినేషన్స్ ఏంటంటే..

రాజస్తాన్ లాల్‌మాస్

స్వీట్స్‌ను ఎక్కువగా ఇష్టపడేవాళ్లు ఒక్కసారైనా రాజస్తాన్ వెళ్లాలి. జైపూర్, జోధ్‌పూర్ వంటి నగరాల్లో పెద్ద పెద్ద స్వీట్ హౌస్‌లు కనిపిస్తాయి. లోపల వందల కొద్దీ వెరైటీలుంటాయి. అలాగే రాజస్తాన్‌లో బాతీ చారుమా, లాల్‌మాస్ వంటి వంటకాలు కూడా ఫేమస్.

ఢిల్లీ చాట్

మీరు స్ట్రీట్ ఫుడ్ లవర్స్ అయితే తప్పకుండా ఢిల్లీ విజిట్ చేయాలి. ఢిల్లీలోని ఛాందినీ చౌక్.. స్ట్రీట్ ఫుడ్‌కు ఫేమస్. చాట్, పానీపూరీ, కబాబ్స్, ముఘలాయి వంటకాలు ఇలా.. ఎన్నో రకాల వెరైటీలు అక్కడ లభిస్తాయి.

అమృత్‌సర్ కుల్చా

అసలు సిసలైన నార్త్ ఇండియన్ వెజిటేరియన్ వంటకాలను రుచి చూడాలంటే పంజాబ్‌లోని అమృత్‌సర్ కు వెళ్లాలి. ఇక్కడ అమృత్‌సర్ కుల్చా, సార్సన్ దా సాగ్, మక్కి దీ రోటీతో పాటు పలు రకాల వెజిటేరియన్ డిష్‌లు, రకరకాల పరాఠాలు లభిస్తాయి.

హైదరాబాద్ హలీమ్

నాన్‌వెజ్ ప్రియులు తప్పక విజిట్ చేయాల్సిన ప్రదేశాల్లో హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. హైదరాబాద్ బిర్యానీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతోపాటు హలీమ్, కబాబ్స్, మందీ వంటి అన్ని రకాల నాన్‌వెజ్ డిష్‌లకు, అరేబియన్, ముఘల్ వంటకాలకు హైదరాబాద్ ఫేమస్.

బెంగళూరు టిఫిన్స్

ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ వంటకాలు రుచి చూడాలంటే బెంగళూరు వెళ్లాల్సిందే. సౌత్ ఇండియన్ టిఫిన్స్‌లోని అన్నిరకాల ఇక్కడ దొరుకుతాయి. ఇడ్లీ, దోశల్లోని పలు వెరైటీలతో పాటు ఇంటర్నేషనల్ కిచెన్స్‌కు కూడా బెంగళూరు ఫేమస్.

గోవా సీ ఫుడ్

సీ ఫుడ్‌ను ఇష్టపడేవాళ్లు గోవా తప్పకుండా వెళ్లాలి. ఇక్కడ లోకల్ వెరైటీస్‌తో పాటు ఇంటర్నేషనల్ డిష్‌లు కూడా దొరుకుతాయి. పోర్చుగీస్ వంటకాలకు గోవా ఫేమస్. స్క్విడ్, లాబ్‌స్టర్ వంటి ప్రీమియం సీ ఫుడ్‌ను ట్రై చేయడానికి గోవా బెస్ట్ ప్లేస్.

కోల్‌కతా స్వీట్స్

వరల్డ్ ఫేమస్ స్వీట్స్‌కు కోల్‌కతా ఫేమస్. రసగుల్లా, మిస్టీదోయి, కతీరోల్స్, పుచ్‌కా వంటి ట్రెడిషనల్ బెంగాల్ రుచులతో పాటు పలురకాల సీ ఫుడ్ వెరైటీలు కూడా ఇక్కడ ఆస్వాదించొచ్చు.

First Published:  24 Nov 2023 9:30 AM GMT
Next Story