Telugu Global
Travel

వాస్కోడిగామా అడుగుపెట్టిన ప్రాంతాన్ని చూద్దాం రండి

కర్ణాటక ఎన్నో చారిత్రక ఘటనలకు సజీవ సాక్ష్యం. తీర ప్రాంత సోయగంతో... పచ్చని ప్రకృతితో అలారాడుతూ ఉంటుంది. అటవీ అందాలు, పక్షుల కిలకిల రాగాలు, జంతువుల పలకరింపులతో కన్నడ నాడు ఎన్నో వింతలు, విశేషాలకు అలవాలంగా మారింది.

వాస్కోడిగామా అడుగుపెట్టిన ప్రాంతాన్ని చూద్దాం రండి
X

వాస్కోడిగామా అడుగుపెట్టిన ప్రాంతాన్ని చూద్దాం రండి

కర్ణాటక ఎన్నో చారిత్రక ఘటనలకు సజీవ సాక్ష్యం. తీర ప్రాంత సోయగంతో... పచ్చని ప్రకృతితో అలారాడుతూ ఉంటుంది. అటవీ అందాలు, పక్షుల కిలకిల రాగాలు, జంతువుల పలకరింపులతో కన్నడ నాడు ఎన్నో వింతలు, విశేషాలకు అలవాలంగా మారింది. అడవులు, కనుమల్లో ఎక్కడ చూసినా హరిత శోభ ఉట్టిపడుతుంది. ఈ కన్నడనాడులో ఎన్నో అద్భుతమైన ద్వీపాల్లో అత్యంత ముఖ్యమైనది సెయింట్‌ మేరీ ఐలాండ్‌. ఈ ద్వీపానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. పదండి ఓసారి వెళ్లి ఆ చరిత్ర పుటల్లో ఏం రహస్యం ఉందో తెలుసుకుని వద్దాం...



వాస్కో డి గామా తొలిసారిగా అడుగు పెట్టిన భూమి, కర్ణాటకలోని సెయింట్ మేరీస్ ద్వీపం. ఉడిపి తీరానికి కొద్ది దూరంలో ఈ ద్వీపం ఉంది. వాస్కో డి గామా 1498లో కాలికట్ చేరుకోవడానికి ముందు ఈ ద్వీపంలో కాలుమోపాడని చరిత్ర చెబుతోంది. ఈ ద్వీపంలో తెల్లటి ఇసుక బీచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సెయింట్ మేరీస్ ద్వీపం అన్ని వైపులా పెద్ద కొండ రాళ్లతో కప్పబడి ఉంటుంది. దీనివల్లే ద్వీపం ఇప్పటికీ చెక్కుచెదరకుండా... సముద్ర కోతకు గురికాకుండా అంతే స్వచ్ఛంగా ఉంది. ఈ ద్వీపం వెంబడి కొలువుదీరిన కొబ్బరి చెట్లు మేరీస్‌ ద్వీపానికి అదనపు అందాన్ని తెచ్చాయి.


ఎప్పుడూ రావచ్చు

సెయింట్‌ మేరీస్‌ ద్వీపాన్ని చూసేందుకు అక్టోబరు నుంచి జనవరి మధ్యకాలం చాలా అనువైనది. ఆ సమయంలో తక్కువ వేడి వల్ల అన్ని ప్రదేశాలు అలసిపోకుండా చుట్టిరావచ్చు.

ఎలా చేరుకోవాలి

సెయింట్‌ మేరీస్‌ దీవులు సముద్ర తీరం నుంచి 4 మైళ్ల దూరంలో ఉంటాయి. ఈ దీవిని చేరుకోవాలని నాలుగు మైళ్ల దూరం ఫెర్రీలు ప్రయాణించాయి. ఫెర్రీలు ఉదయం 9:00 నుంచి సాయంత్రం 5:00 వరకు అందుబాటులో ఉంటాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాకాలంలో ఈ ఫెర్రీల రవాణను నిలిపేస్తారు. ఫెర్రీ రైడ్‌కు ఒక్కో వ్యక్తికి సుమారుగా 300 రూపాయలు వసూలు చేస్తారు.

విమానం ద్వారా ఇలా....

మాల్పే నుంచి 58 కి.మీ దూరంలో ఉన్న మంగళూరులో సమీప విమానాశ్రయం ఉంది. అక్కడి నుంచి సెయింట్ మేరీస్ ద్వీపానికి ఫెర్రీల ద్వారా చేరుకోవచ్చు. మాల్పే నుంచి 4 కి.మీ దూరంలో ఉన్న ఉడిపికి రైల్వేస్టేషన్ ఉంది. ఆటోరిక్షాలు, క్యాబ్‌ల ద్వారా మాల్ఫేకు చేరుకుని అక్కడినుంచి సెయింట్‌ మేరీస్‌ ద్వీపానికి చేరుకోవచ్చు.

First Published:  11 Oct 2023 7:07 PM IST
Next Story